
ఈ మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ మంచి ఫామ్ లో కనిపించాడు. ఇక కెప్టెన్ కేన్ విలియమ్సన్ నిరాశపరిచినప్పటికి ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కరం ఇక అద్భుతమైన ఫామ్ లో దూకుడుగా ఆడాడు. ఇద్దరు వికెట్ కాపాడుకుంటూ సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ ఉండటం చూస్తే సన్రైజర్స్ స్కోర్ 200 దాటి పోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అంతలోనే అభిషేక్ శర్మ వికెట్లు కోల్పోవడం అటు వెంటనే కేవలం 22 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లుకోల్పోయింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.
అలాంటి సమయంలోనే క్రీజులోకి వచ్చాడు శశాంక్ సింగ్. అత్తనెవరో కొత్త ఆటగాడు.. అతను ఏం రాణిస్తాడులే.. ఏదో జట్టులో ఉన్నాడు కాబట్టి పంపించారు అంతే అని అనుకున్నారు ప్రేక్షకులు. కానీ ఊహించని రీతిలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఏకంగా వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన ఫెర్గ్యూసన్ ఓవర్ లో చీల్చి చెండాడాడు.హాట్రిక్ సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు. అతని బ్యాటింగ్ చూసి గుజరాత్ ప్లేయర్లు కూడా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. కాగా శశాంక్ ను సన్రైజర్స్ జట్టు 20 లక్షలకు దక్కించుకుంది. అతడు ఆడిన మొదటి మ్యాచ్ కూడా ఇదే కావడం గమనార్హం. రానున్న మ్యాచులలో సన్రైజర్స్ లో అతను కీలకంగా మారబోతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు..