మయాంక్ అగర్వాల్.. గత ఏడాది ఐపీఎల్ సీజన్ వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కీలక ఆటగాడిగా మాత్రమే కొనసాగాడు. కానీ ఈ ఏడాది  ఏకంగా కెప్టెన్ గా అవతరించాడు అన్న విషయం తెలిసిందే. పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా మారి పోయిన మయాంక్ అగర్వాల్ జట్టును ఎంతో సమర్థవంతం గా ముందుకు నడిపిస్తున్నాడు. మధ్యలో కొన్ని పరాజయాలు ఎదురైనప్పటికీ ఎక్కడ వెనకడుగు వేయకుండా జట్టు లోని ఆటగాళ్లు అందరిలో కూడా ఆత్మ విశ్వాసాన్ని నింపుతూ ఇక ప్రత్యర్థి జట్టు పై విజయాలు సాధిస్తూ ఉండటం గమనార్హం.


 ఈ క్రమం లోనే ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ జట్టు ఆరు విజయాలు ఆరు పరాజయాలతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతుండడం గమనార్హం. అయితే ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే అటు పంజాబ్ కింగ్స్ ఆడబోయే ప్రతి మ్యాచ్లో కూడా విజయం సాధించాల్సినా అవసరం ఉంది. ఈ క్రమంలోనే ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్న పంజాబ్ వరుస విజయాలను అందుకుంటుంది. ఇక సాధారణంగా మయాంక్ అగర్వాల్ ఎప్పుడు ఓపెనర్ గానే బరిలోకి దిగడం ఇప్పటివరకు చూశారు క్రికెట్ ప్రేక్షకులు.


 కానీ ఇటీవలే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా మారిన తర్వాత తన ఓపెనర్ స్థానాన్ని త్యాగం చేసి బెయిర్స్ స్ట్రో కీ అప్పగించాడు మయాంక్ అగర్వాల్.  ఇటీవలే ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ స్పందిస్తూ మయాంక్ అగర్వాల్ పై ప్రశంసలు కురిపించాడు. తన జుట్టు ప్రయోజనాల కోసం మయాంక్ అగర్వాల్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసి ఇక ఆ స్థానాన్ని హిట్టర్ బెయిర్ స్ట్రోకి ఇచ్చాడని గుర్తు చేశాడు. అప్పటినుంచి బెయిర్ స్ట్రో అదరగొడుతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. మయాంక్ అగర్వాల్ నిజమైన కెప్టెన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు సంజయ్ మంజ్రేకర్..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl