ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఎంతో మంది యువ ఆటగాళ్లు తెరమీదికి వస్తూ సత్తా చాటుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఏడాది ఐపీఎల్ సీజన్ లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న ఆటగాళ్లలో  రాహుల్ త్రిపాది కూడా ఒక్కడు.  ప్రతి మ్యాచ్లో కూడా భారీగా పరుగులు చేసి అదరగొడుతున్నాడు రాహుల్ త్రిపాటి  ప్రతి మ్యాచ్లో కూడా క్రమం తప్పకుండా పరుగులు చేస్తూ అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తనకు బౌలింగ్ చేస్తుంది ఎవరైనా సరే కనీసం పట్టించుకోకుండా  కొడుతున్నాడు రాహుల్ త్రిపాఠి

 ఈ క్రమంలోనే అతని ఆట తీరు పై స్పందించిన ఆకాశ్ చోప్రా  అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో తనకు ఇష్టమైన అత్యంత అన్ క్యాప్డ్  ప్లేయర్లను రాహుల్ త్రిపాటి ఒకరు అంటూ చెప్పాడు ఆకాశ్ చోప్రా. ప్లే ఆఫ్  సజీవంగా ఉండాలంటే తప్పకుండా గెలిచి తీరాల్సిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయం సాధించింది. ఇటీవలే ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న విలియంసన్ సేనా 193 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ముందు ఉంచింది. ఈ లక్ష్యాన్ని సాధించలేక ముంబై ఇండియన్స్ మూడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది.


 సన్రైజర్స్ విజయంలో కీలక పాత్ర వహించిన రాహుల్ త్రిపాటీ అద్భుతమైన ఆట తిరుతో అందరిని ఫిదా చేసేసాడు  అంటూ ఏకంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పడం గమనార్హం. ఇటీవల సన్రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 44 బంతుల్లో 9 ఫోర్లతో 76 పరుగులు చేశాడు రాహుల్ త్రిపాఠి. ఇలా జస్ ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో కూడా దంచి కొట్టాడు అంటూ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. అతని కెరీర్లో ఇలాగే రాణిస్తే తప్పకుండా టీమిండియాకు కనెక్ట్ అయ్యే ఎక్కువయ్యే అవకాశం ఉందని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: