టీమిండియా లో స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్నాడు శిఖర్ ధావన్. ఎన్నో మ్యాచులలో అద్భుతమైన ఆరంభం అందింది జట్టు విజయం లో కీలక పాత్ర వహించాడు. అంతేకాదు ఎన్నో రికార్డులను కూడా కొల్లగొట్టాడు. ఈ క్రమం లోనే అభిమానులు అందరూ శిఖర్ధావన్ ను గబ్బర్ అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. అయితే  స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్న శిఖర్ ధావన్ ఇక ఇప్పుడు మాత్రం భారత జట్టుకు చాలా దూరం అయిపోయాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత మళ్లీ భారత జట్టులో ఎక్కడా కనిపించలేదు.


 ప్రస్తుతం యువ ఆటగాళ్ల నుంచి తీవ్రమైన పోటీ పెరిగి పోయిన నేపథ్యంలో ఇక సీనియర్ అయిన శిఖర్ ధావన్ కు చోటు దక్కడం కష్టంగా మారి పోయింది అని చెప్పాలి. ఈ క్రమం లోనే రానున్న రోజుల్లో అయినా అతనికి టీమిండియా లో చోటు దక్కుతుందా లేదా అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అనే చర్చ కూడా తెరమీదికి వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన వార్నర్ తన భవిష్యత్తు గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదని మరో మూడేళ్ల పాటు క్రికెట్  తప్పకుండా ఆడుతాను అంటూ స్పష్టం చేశాడు.


 టీ-20 ఫార్మెట్లో రాణించగలను అంటూ విశ్వాసం వ్యక్తం చేశాడు శిఖర్ ధావన్. అన్నీ ఫార్మాట్ లలో కూడా నిలకడగానే ఉన్నాను అంటు చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్  తరఫున ఆడుతున్న శిఖర్ ధావన్ ఓపెనర్గా తన ప్రదర్శన తో ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. ఇక అతని ప్రదర్శన చూసిన తరువాత రానున్న రోజుల్లో టీమిండియా లో అతనికి చోటు దక్కడం ఖాయమని అభిమానులు కూడా బలం గా నమ్ముతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: