రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అటు మైదానంలో ఎంత బిజీగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు వేట కోసం ఎదురుచూస్తున్న చిరుత పులిలా సీరియస్ గానే కనిపిస్తూ ఉంటాడు. కానీ మైదానం బయట మాత్రం ఎప్పుడూ నవ్వులు చిందిస్తూ సరదా సరదాగా గడుపుతూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఇకపోతే మ్యాచ్ ఉత్కంఠ భరితంగా  జరుగుతున్న సమయంలో ప్రత్యర్ధి జట్టు వికెట్ పడగొట్టినప్పుడు విరాట్ కోహ్లీ ఏకంగా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు భయపడే విధంగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాడు.


 ఇలా కోహ్లీ తన దూకుడు తోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రత్యర్థి ఆటగాళ్లు ఎంత దిగ్గజ ప్లేయర్లు అయినా సరే విరాట్ కోహ్లీ అస్సలు లెక్క చేయడు. మాటకు మాట బదులు ఇవ్వడమే కాదు కొన్ని కొన్ని సార్లు గొడవకు దిగడం లాంటివి కూడా చేస్తూ ఉంటాడు. కాగా ఇటీవలే ఐపీఎల్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఏకంగా భారత జట్టులో తన సహచర ఆటగాడిగా ఐపీఎల్లో ప్రత్యర్థిగా ఉన్నా శుభమన్ గిల్ కీ  కోహ్లీ ఏకంగా వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.


 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. బ్యాటింగ్ చేయడంలోనే కాదు స్లెడ్జింగ్ చేయడంలో కూడా కోహ్లీ టాప్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో గిల్ ను చూస్తూ సీరియస్గా చంపేస్తా అన్నట్లుగా వార్నింగ్ ఇచ్చాడు. దీంతో శుబ్ మన్ గిల్ కూడా కోహ్లీ వైపు ఎంతో సీరియస్ గా చూస్తూ వెళ్ళిపోయాడు అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్లో మళ్ళీ ఫాంలోకి వచ్చినట్లు కనిపించిన విరాట్ కోహ్లీ54 బంతుల్లో 73 పరుగులు చేసిన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: