భారత్ కి చిరకాల ప్రత్యర్థి శత్రువు పాకిస్తాన్ అన్న విషయం తెలిసిందే.  కేవలం యుద్ధం లో మాత్రమే కాదు అటు క్రీడల్లో కూడా ఇక ఇలాంటి బంధమే కొనసాగుతూ ఉంటుంది. పాకిస్తాన్ భారత్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటే కేవలం ఇరుదేశాల ప్రేక్షకులు మాత్రమే కాదు క్రికెట్ ప్రేక్షకులు కూడా టీవీలకు అతుక్కుపోయి మరి వీక్షిస్తూ ఉంటారు. అయితే అటు అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ భారత్ మధ్య మ్యాచ్ చూడడం చాలా అరుదనే చెప్పాలి. కేవలం అంతర్జాతీయ ఈవెంట్లో మాత్రమే పాకిస్తాన్ భారత జట్లు తలపడుతున్నాయి.


 అందుకే అక్కడ మాత్రమే ఈ రెండు జట్ల మధ్య పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది. దీనికి కారణం భారత్ పాకిస్తాన్ క్రికెట్ పై నిషేధం విధించడమే. కాగా పాకిస్తాన్ భారత్ మధ్య జరిగే మ్యాచ్ ను హై ఓల్టేజీ మ్యాచ్ అని కూడా పిలుస్తుంటారు ప్రేక్షకులు. అయితే నేడు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో భారత్ జట్టు తలపడనుంది. అయితే క్రికెట్ మ్యాచ్ కాదు హాకీ మ్యాచ్ జరగబోతోంది. జకార్త వేదికగా నేడు పాకిస్తాన్తో తొలి మ్యాచ్ భారత హాకీ జట్టు ఆడబోతున్నాడు. ఈ క్రమంలోనే ఆసియా కప్ టైటిల్ వేటను ప్రారంభించబడుతుంది.


 వీరేంద్ర లాక్రా కెప్టెన్సీలో భారత హాకీ జట్టు బరిలోకి దిగబోతోంది అనేది తెలుస్తుంది. ఇక ప్రస్తుతం సీనియర్లు విశ్రాంతి తీసుకోవడంతో భారత జట్టులో పది మంది ఆటగాళ్లను తొలిసారి అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే కొత్త ఆటగాళ్లతో భారత హాకీ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఎలా ఎదుర్కోబోతోంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. సాయంత్రం 5 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇక ఈ మ్యాచ్ను వీక్షించాలి అనుకునే ప్రేక్షకులు స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ ఛానల్లో.. అటు ఓటీటీ వేదికగా డిస్నీ డిస్ని హాట్ స్టార్  లో కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: