ఈ ఏడాది ఎప్పటిలాగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ఇక తమ ప్రతిభతో సెలెక్టర్లు చూపులో పడ్డారు. సెలక్టర్ల దృష్టిలో పడిన తర్వాత వాళ్ళు ఊరుకుంటారా ఇక టీమిండియాలో అవకాశం ఇచ్చేశారు. ఐపీఎల్ తర్వాత టీమిండియా ఆడబోయే టి20 టెస్ట్ సిరీస్ కు సంబంధించి బీసీసీఐ జట్టు ప్రకటన చేయగా.. ఎంతో మంది యువ ఆటగాళ్లకు ఛాన్స్ దొరికింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాతో టి 20 సిరీస్ కోసం బీసీసీఐ  ఎంపిక చేసిన జట్టుపై మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా పెదవి విరిచాడు.


 18 మందితో కూడిన జట్టుతో ఫలితాలు ఎలా రాబట్టగలం అని అనుకుంటున్నారు అంటూ ప్రశ్నించాడు. ఐదుగురు ఫాస్ట్ బౌలర్లు నలుగురు స్పిన్నర్ లను ఎంపిక చేయడం బాగానే ఉన్నా కొంతమందికి అవకాశం ఇవ్వడం మాత్రం సాధ్యం అవుతుందా అంటూ ప్రశ్నించాడు ఆకాశ్ చోప్రా. జూన్ 9వ తేదీ నుండి అటు సౌతాఫ్రికాతో భారత్ వేదిక టి20 సిరీస్ ఆడ బోతుంది  టీమిండియా. ఈ క్రమంలోనే  18 మందితో కూడిన భారత జట్టును ఇటీవల బిసిసీఐ అధికారికంగా ప్రకటించారు. రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడం తో కె.ఎల్.రాహుల్ కెప్టెన్ గా నియమించారు.


 ఐపీఎల్ గణాంకాల ఆధారంగా ఎంతో మంది యువ ఆటగాళ్లకు జట్టులో స్థానం కల్పించారు. ఇదే విషయంపై ఆకాష్ చోప్రా స్పందిస్తూ 18 మంది సభ్యులు సెలెక్ట్ చేశారు. ఇందులో ఐదుగురు ఫాస్ట్ బౌలర్లు నలుగురు స్పిన్నర్లు ఉన్నారూ. జట్టును ఎంపిక చేసినప్పుడు మీరు ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వలేదు. కాగా ఈ విషయంలో మీరు పశ్చాత్తాప పడక తప్పదు. కళ్ళ ముందు ఎన్నో ఆప్షన్లు కనిపిస్తాయి. కానీ ఏదో ట్రై చేసే అవకాశం రాకపోవచ్చు అంటూ భారత సెలెక్టర్లను ఉద్దేశించి ఆకాశ్ చోప్రా కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: