
అయితే మెగా వేలంలో పాల్గొన్నప్పటికీ అతని ఏ ఫ్రాంచైజీని కొనుగోలు చేయకపోవడంతో నిరాశ చెందిన చటేశ్వర్ పుజారా చివరికి ఇంగ్లాండ్ కౌంటీ లలో ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. అయితే ఇటీవలే ఇక టీమిండియాలో కి మళ్లీ పునరాగమనం చేయడంపై చటేశ్వర్ పుజారా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ లో ఆడకపోవడం తనకు ఎంతో మంచిది అయింది అంటూ పూజారా షాకింగ్ కామెంట్స్ చేశాడు. మీరే ఇప్పుడు ఆలోచించి చెప్పండి.. ఒకవేళ నన్ను ఐపీఎల్ లో ఏదైనా జట్టు కొనుగోలు చేసి ఉంటే.. నాకు తుది జట్టులో అవకాశం ఇచ్చేవారు కాదు.. నేను నెట్స్ లో ప్రాక్టీస్ చేయడం తప్ప ఇంకా ఏమీ ఉండేది కాదు.
అదే ఇంగ్లాండ్ కౌంటీలలో ఆడితే తుది జట్టులో చోటు తో పాటు ఇక ప్రాక్టీస్ కూడా లభిస్తోంది. అందుకే ఇంగ్లాండ్ కౌంటీలో ఆడాలి నేను నిర్ణయించుకున్నాను. తన ఫామ్ మళ్లీ పొందేందుకు ఇంగ్లాండ్ కు వెళ్లాను. అయితే ఇంగ్లండ్ కౌంటీ లలో నేను టీమిండియాలో కి రీ ఎంట్రీ కోసం మాత్రం ఆడలేదు. ఫామ్ తిరిగి పొందడానికి మాత్రమే ఆడాను. ఇది ఒక పెద్ద ఇన్నింగ్స్.. నా కెరియర్ కి సహాయపడుతుందని తెలుసు అంటూ ఓ ఇంటర్వ్యూలో చటేశ్వర్ పుజారా వ్యాఖ్యానించాడు..