అయితే కొత్త కెప్టెన్ స్టోక్స్ ను తమ బౌలర్లు అగ్రస్థానంలో నిలబెట్టారు అని చెప్పాలి. ఎందుకంటే కివీస్ ను మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 132 పరుగులకే కుప్పకూల్చింది. ఇందులో మొదటి నుండి ఆండర్సన్ మరియు పాట్స్ లు చెలరేగి కివీస్ పతనాన్ని శాసించారు. చెరో 4 వికెట్లు తీసుకుని స్వల్ప స్కోర్ కు కివీస్ ను పరిమితం చేశారు. కివీస్ ఆటగాళ్లలో కేవలం గ్రాండ్ హోమ్ ఒక్కడే అత్యధికంగా 42 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ విలియమ్సన్ ఐపీఎల్ లో పోగొట్టుకున్న ఫామ్ ను అలాగే పేలవమైన ఆటతో కొనసాగిస్తున్నాడు.
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి స్టడీ గానే ఉన్నట్లు కనిపించినా ఓపెనర్ క్రాలీ వికెట్ ను కోల్పోయింది. ఇతను పరుగులు చేసి జెమీ సన్ బౌలింగ్ లో బ్లాండెల్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఇక ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఎక్కువ పరుగులు చేసి ఇన్నింగ్స్ విజయం కోసం చూడాలి. ఇక మొదటి టెస్ట్ లోనే తన కెప్టెన్సీ స్టామినాని నిరూపించుకున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి