ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్ లీచ్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆరో ఓవర్ లో మూడో బంతిని డెవోన్ కాన్వెట్ థర్డ్ మ్యాన్ దిశగా షాట్ ఆడాడు. ఇక బంతి బౌండరీకి చేరే క్రమంలో జాక్ లీచ్ డైవ్ చేస్తూ ఆపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే బౌండరీ లైన్ వద్ద అతని తలకు గాయం అయింది. డ్రైవ్ చేసే క్రమంలో బౌండరీ లైన్ కు తాకి పల్టీ కొట్టాడు. దీంతో ఇక తన శరీరం బరువు మొత్తం తలపై పడిపోయింది. వెంటనే అతను గ్రౌండ్లో అలాగే పడుకుండి పోయాడు. ఇక అక్కడే ఉన్న న్యూజిలాండ్ ఫిజియో లు అతనికి సహాయం అందించారు. వెంటనే ఇంగ్లాండ్ ఫిజీయోలు అక్కడికి చేరుకున్న తర్వాత తన పరిస్థితిని పరిశీలించారు. దాంతో మ్యాచ్ ఐదు నిమిషాల పాటు ఆగిపోయింది అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత లీచ్ నడుచుకుంటూ డ్రెస్సింగ్ రూం వైపు వెళ్ళాడు. దీంతో ప్రాణాపాయం తప్పింది అని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ క్రమంలోనే కంకషన్ కారణంగా అతను తప్పుకోవడంతో అతని స్థానంలో సబ్స్టిట్యూట్ కింద వేరే ప్లేయర్ని బరిలోకి దింపుతామని ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ద్వారా పేర్కొంది. ఇక లార్డ్స్ మొదటి టెస్టులో ఊహకందని విధంగా ఏకంగా తొలి రోజు 17 వికెట్లు నేలకూల్చారూ. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 132 పరుగులకు ఆలౌటయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు నష్టపోయి 116 పరుగులు చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి