భారత్ పాకిస్తాన్ ఇక ఈ రెండు దేశాల పేరు వినిపించింది అంటే చాలు అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులలో ఏదో తెలియని కొత్త ఆసక్తి వస్తూ ఉంటుంది. ఈ రెండు జట్ల మధ్య  జరిగిందంటే చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు అని చెప్పాలి. అయితే ఇక ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ జరిగితే కేవలం భారత్ పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల మొత్తం ఎంతో ఆసక్తిగా మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు అని చెప్పాలి. అందుకే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ని హై వోల్టేజ్ మ్యాచ్ గా పిలుచుకుంటూ ఉంటారు. ఈ రెండు జట్లు కూడా ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించేందుకు ఎప్పుడూ హోరాహోరీగా తలపడతాయ్. కేవలం మైదానంలో మ్యాచ్ లలో మాత్రమే కాదు రికార్డులలో కూడా పోటీ పడుతూ ఉంటాయి అని చెప్పాలి.


 అయితే భారత దాయాది దేశమైన పాకిస్థాన్ ఇటీవల కాలంలో ఎంత అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రత్యర్థులకు  ఎక్కడ అవకాశం ఇవ్వకుండా వరుసగా విజయాలు సాధిస్తూ సత్తా చాటుతుంది అనే చెప్పాలి. అదే సమయంలో అటు టీమిండియా మాత్రం ప్రత్యర్థుల చేతిలో ఓటమి పాలు అవుతూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలోనే ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు ఇండియా కు ఊహించని షాక్ ఇచ్చింది అని చెప్పాలి.


 ఇటీవల ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకుల్లో భారత్ ను వెనక్కినెట్టి 4వ స్థానం లోకి వచ్చింది పాకిస్తాన్. వెస్టిండీస్తో పాకిస్థాన్ వేదికగా జరిగిన వన్డే సిరీస్ లో ప్రత్యర్థి వెస్టిండీస్ క్లీన్స్వీప్ చేసింది పాకిస్తాన్. ఈ క్రమంలోనే వన్డే ర్యాంకింగ్స్ లో స్థానాన్ని మెరుగుపరుచుకుని టీమిండియాను వెనక్కి నెట్టింది అని తెలుస్తుంది. 125 పాయింట్లతో  న్యూజిలాండ్ జట్టు తొలి స్థానంలో ఉంది. ఇక ఇంగ్లాండ్ జట్టు 124, ఆస్ట్రేలియా 107, పాకిస్తాన్ 106, టీమిండియా 105, సౌతాఫ్రికా 99, బంగ్లాదేశ్ 95, శ్రీలంక 87, వెస్టిండీస్ 72 వరుసగా ఐసీసీ ర్యాంకుల ను సొంతం చేసుకుంది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: