ఇటీవలే టీమిండియాలో అవకాశం దక్కించుకున్న హార్దిక్ పాండ్యా అక్కడ కూడా తన బ్యాటింగ్తో బౌలింగ్ తో కూడా ఆకట్టుకుంటున్నాడు. ఇక మరోవైపు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లబోయే టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను కూడా ఇటీవల హార్దిక్ పాండ్యాకు అప్పగించింది బీసీసీఐ. దీంతో ఇక హార్దిక్ పాండ్యా అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగి పోతున్నారు అని చెప్పాలి. అయితే హార్దిక్ పాండ్యా ప్రదర్శనపై ఇటీవలే ఆస్ట్రేలియా దిగ్గజం మెక్ గ్రాత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బౌలింగ్ లయను తిరిగి ఎలా అందుకోవాలో తెలుసుకోవడానికి అవసరమైన అనుభవం హార్దిక్ పాండ్యా కు ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.
ఒకప్పటిలా హార్దిక్ పాండ్యా పదునైన బౌలింగ్ చేయగలడా అనే అనుమానాలు వ్యక్తం అవుతూ ఉండడం పై స్పందించిన మెక్ గ్రాత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. హార్దిక్ కి ఇప్పుడు అనుభవం ఉంది. తానేం చెయ్యాలో అతనికి తెలుసు. అతను ఏం చేయాలన్నది కోచ్ లు చెప్పాల్సిన పనిలేదు. హార్థిక్ పాండ్య నాణ్యమైన ఆల్రౌండర్.. నాణ్యమైన హిట్టర్..కొన్ని మ్యాచులు రాణించడం కొన్ని మ్యాచ్ లలో రాణించక పోవడం అందరి విషయంలో సహజం. తానేం చేయాలన్నది హార్దిక్ పాండ్యా కు తెలుసు. కేవలం వేగంగా బంతి వేయాలని కోచ్ లు చెబుతారు.. కానీ వేగంతో పాటు వికెట్లు కూడా తీయగలగాలి అంటూ తెలిపాడు మెక్ గ్రాత్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి