
ఈ క్రమంలోనే యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం జరుగుతున్న సౌత్ ఆఫ్రికా తో టీ20 సిరీస్ లో రెండు మ్యాచ్ లలో విఫలమైనప్పటికీ మూడో మ్యాచ్లో మాత్రం నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు అన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటికి మొన్న ముగిసిన ఐపీఎల్ టోర్నీలో కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన చాహల్ ఇక ఐపీఎల్ సీజన్ లోనే అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. పర్పుల్ క్యాప్ హోల్డర్ గా అవార్డు కూడా దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే అతని ప్రదర్శనపై ఇక ఇప్పుడు ప్రేక్షకుల్లో అంచనాలు కూడా అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
అయితే సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజు యుజ్వేంద్ర చాహల్ 2016లో టీమ్ ఇండియా తరఫున అంతర్జాతీయ టి-20 లోకి అరంగేట్రం చేశాడు. ఇక ఇలా టీమిండియా లో చేరిన కొద్ది రోజులకే అతని బౌలింగ్ మెలకువలతో బ్యాట్స్మెన్లను పెవిలియన్ కు చేర్చి అందరిని ఆకట్టుకున్నాడు. అయితే కేవలం ఐదేళ్ళ క్రితమే టీమిండియా లోకి వచ్చినప్పటికీ ప్రస్తుతం టీమిండియా తరఫున టి20 ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు చాహల్. ఈక్రమంలోనే ఇక ఇటీవల ఇదే విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది అని చెప్పాలి.