ఇటీవలే సొంత గడ్డపై టీమిండియా సౌత్ ఆఫ్రికా తో టీ20 సిరీస్ ముగించుకుంది. అయితే ఈ టి 20 సిరీస్ 2-2 తో సమమైంది అనే చెప్పాలి.5వ టి20 మ్యాచ్లో ఫలితం తేలాల్సి ఉన్నప్పటికీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో చివరికి సిరీస్ సమం అయింది. అయితే మరికొన్ని రోజుల్లో టీమ్ ఇండియా జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరుతుంది. ఇప్పటికే ఐర్లాండ్ పర్యటనకు వెళ్లబోయే జట్టుకు సంబంధించి అటు బిసిసిఐ పూర్తి వివరాలను ప్రకటించిన విషయం తెలిసిందే.


 ఐర్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడ టీ20 సిరీస్ ఆడబోయే జట్టుకు టీమిండియా కెప్టెన్గా హార్దిక్ పాండ్యా వ్యవహరించబోతున్నాడు. 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇక ఈ ఐర్లాండ్ సిరీస్కు కూడా జట్టులో సీనియర్ ఆటగాళ్ల దూరమయ్యారు అన్న విషయం తెలిసిందే.  అయితే ఇక మరికొన్ని రోజుల్లో జరగబోయే టి20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని ఉమ్రాన్ మాలిక్,  అర్షదీప్ సింగ్,  రాహుల్ త్రిపాఠి లాంటి యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు బిసిసిఐ సెలెక్టర్లు. అయితే ఇటీవల ఐపీఎల్లో అదరగొట్టి గుజరాత్ టైటిల్ గెలుపు లో తనవంతు పాత్ర పోషించిన రాహుల్ తేవాటియాకు సిరీస్ లో చోటు దక్కుతుందని అందరూ భావించారు. కానీ సెలక్టర్ల నుంచి అతడికి మరోసారి మొండి చేయి ఎదురైంది. కాగా ఇదే విషయం పై స్పందించిన టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ తేవాటియా ఒక అద్భుతమైన ఆటగాడు అంటూ కొని యాడాడు. ఐపీఎల్ లో మనం చాలాసార్లు చూసామి ఓడిపోవాల్సినా మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించాడు. అతడికి మైదానంలో అన్ని వైపులా షాట్ లు ఆడ గలిగే సత్తా ఉంది. కాబట్టి 18వ ఆటగాడిగా అతడిని ఐర్లాండ్ పర్యటనకు  తీసుకొని ఉంటే బాగుండేది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: