టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరింది . అయితే టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కాస్త ఆలస్యంగానే ఇంగ్లాండుకు బయలుదేరాడు అన్న విషయం తెలిసిందే. సౌత్ ఆఫ్రికా తో టి20 సిరీస్ ముగియగానే రిషబ్ పంత్,  శ్రేయస్ అయ్యర్ లతోపాటు లండన్ ఫ్లైట్ ఎక్కాడు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్. ఈ క్రమంలోనే ఇటీవల అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని టీమిండియాతో కలిశాడు. ఈ క్రమంలోనే వచ్చీరాగానే రాహుల్ ద్రావిడ్ ఇక అందరూ ఆటగాళ్లతో మీటింగ్ ఏర్పాటు చేశాడు అనేది తెలుస్తుంది.  ఇక ఇంగ్లాండ్తో జరగబోయే అన్ని మ్యాచ్ లలో కూడా తప్పక గెలవాలి అనే ఉద్దేశంతో అందరూ ఆటగాళ్లను కూడా సన్నద్దం చేస్తున్నారు.


 ఈ క్రమంలోనే ఇక టీమిండియా ఆటగాళ్లు అందరూ కూడా కోచ్ రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో ప్రాక్టీస్ లో మునిగి తేలుతూ చెమటోడుస్తున్నారు  అని చెప్పాలి. ఇక ఇటీవల బీసీసీఐ ఆటగాళ్ల ప్రాక్టీస్ కు సంబంధించిన దృశ్యాలను ట్విటర్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయాయి. కాగా ఈ ఫోటోలపై స్పందిస్తున్న నెటిజన్లు ఇంగ్లాండ్ తో జరగబోయే 5వ టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా బాగానే కష్టపడుతుంది అని ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. రాహుల్ ద్రవిడ్ రాగానే రుద్ధుడు స్టార్ట్ చేసాడు కదా అంటూ మరి కొంతమంది ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే జూలై 1వ తేదీన ఇంగ్లాండ్ తో రీషెడ్యూల్ టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఐదు రోజులపాటు జరగబోయే ఈ టెస్ట్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.  కాగా గత ఏడాది కరోనా వైరస్ కారణంగా ఈ టెస్ట్ మ్యాచ్ రద్దు అయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇరు దేశాల క్రికెట్ బోర్డులు సంయుక్త ఒప్పందం మేరకు  ఇక ఈ టెస్టు మ్యాచ్ ను రీషెడ్యూల్ చేశారు. ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్లో భాగంగా ఇప్పటికే టీమిండియా 2-1 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. టీమిండియా అధికారికంగా గెలవాలంటే మాత్రం ఐదో టెస్టు మ్యాచ్లో తప్పక విజయం సాధించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: