ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వహిస్తూ టీమిండియా ఆటగాళ్లను ఎప్పటికప్పుడు తన సలహాలు సూచనలతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తు ఇక టీమిండియాను పటిష్టవంతంగా మారుస్తున్నాడు రాహుల్ ద్రావిడ్. రాహుల్ ద్రావిడ్ కోచ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా ఎంతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక టీమిండియా హెడ్ కోచ్ గా మారక ముందు అటు అండర్-19 జట్టుకు కోచ్గా వ్యవహరించాడు రాహుల్ ద్రావిడ్ . ఇక ఎంతో మంది యువ ఆటగాళ్ల ప్రతిభను వెలికి తీసి టీమిండియా ఫ్యూచర్ స్టార్స్ ని  తయారుచేశాడు.


 ప్రస్తుతం అంతర్జాతీయ టీమిండియా జట్టు తరఫున స్టార్ క్రికెటర్ లుగా కొనసాగుతున్న అందరూ కూడా ఒకప్పుడు రాహుల్ ద్రావిడ్ కోచింగ్ లో రాటుదేలిన వారే కావడం గమనార్హం. అయితే ఇక అండర్ 19  కోచ్ గా ఉండడానికి ముందు ఇక టీమిండియాకు ఎన్నో ఏళ్లుగా సేవలు అందించాడు రాహుల్ ద్రావిడ్. ఇక ఎంతో మంది క్రికెటర్లు ఉన్న తనకంటూ ఇండియన్ క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఎన్నో సార్లు టీమిండియాను విజయతీరాలకు నడిపించి అద్భుతమైన విషయాలను అందించాడు.


 దీంతో ఇక ప్రస్తుత టీమిండియా లో మరో రాహుల్ ద్రవిడ్ వుంటే బాగుంటుందని ఎంతో మంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు అని చెప్పాలి. ఇటీవల హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్ కు కూడా ఇలాంటి ప్రశ్న ఎదురైంది. యంగ్ జనరేషన్ నుంచి మరో రాహుల్ ద్రవిడ్ ను మనం చూసే అవకాశం ఉందా అంటూ  యాంకర్ ప్రశ్నించగా.. ఇందుకు ద్రావిడ్ ఆసక్తికర సమాధానం చెప్పాడు.  నేను కూడా అలాంటి రోజు వస్తే చూడాలని అనుకుంటున్నా. ప్రస్తుత క్రికెట్ లో ఆటగాళ్లు మరిన్ని రకాల షాట్స్ ఆడాల్సి ఉంది అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చేసాడు ద్రావిడ్.

మరింత సమాచారం తెలుసుకోండి: