గత కొంత కాలం నుంచి పేలవమైన ఫామ్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు  రిషబ్ పంత్.  ఇండియాలో కీలకమైన ఆటగాడిగా ఎదుగుతున్న రిషబ్ పంత్ మాత్రం టీమిండియాకు మైనస్ గా మారిపోయాడు ఎలా చెప్పాలి. మొన్నటికి మొన్న ముగిసిన ఐపీఎల్ లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు అని చెప్పాలి. కాగా ఇటీవల భారత పర్యటనకు సౌత్ ఆఫ్రికా వచ్చిన సమయంలో టీమిండియాకు కెప్టెన్సీ వహించాడు. సౌత్ ఆఫ్రికా టి20 సిరీస్ లో కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆగలేకపోయాడు.



 దీంతో అతని బ్యాటింగ్ లో ఎన్నో టెక్నికల్ లోపాలు ఉన్నాయని వాటిని వెంటనే రిషబ్ పంత్ సరిచేసుకోవాలని మాజీ ఆటగాళ్లు సూచించారు. ఒకవేళ అతను ఇదే పేలవమైన ఫామ్ లో కొనసాగితే  జట్టులో స్థానం కోల్పోవడం ఖాయం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొంతమంది ఇంత పేలవమైన ప్రదర్శన చేస్తున్నప్పుడు అతని టీమిండియాలో ఎందుకు కొనసాగిస్తున్నారు అంటూ బీసీసీఐ పై ప్రశ్నల వర్షం కురిపించారు.. అయితే ఇటీవల తనపై విమర్శలు చేసిన వారి అందరి నోళ్లు మూయిస్తూ ఇంగ్లాండ్ తో టెస్ట్ లో సెంచరీ చేయడమే కాదు 146 పరుగులు చేసి అదరగొట్టాడు.


 ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రిషబ్ పంత్. ఇంగ్లాండ్ తో జరుగుతున్న  టెస్టు  ఇన్నింగ్స్ పై స్పందిస్తూ నేను ఎప్పుడూ ఒకేలా ఆడకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాను. దీని ద్వారా బౌలర్ మానసికంగా ఎంతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ లాంటి పిచ్ లలో బౌలర్లు బాగా బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ లైన్ అండ్ లెంగ్త్ కు భంగం కలిగించడం చాలా ముఖ్యం.. ఇటీవల జరిగిన టెస్ట్ మ్యాచ్లో తాను కూడా అలాంటిదే చేశాను అంటూ
 అంటూ రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. కాగా రిషబ్ పంత్ అద్భుతమైన ప్రదర్శన కారణంగానే క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కిన టీమిండియా గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: