మొన్నటి వరకు ఓటమి బాధలో ఉన్న టీమ్ ఇండియా జట్టు ఇక ఇప్పుడు మాత్రం అనూహ్యంగా పుంజుకుంది అన్న విషయం తెలిసిందే. క్రికెట్లో దిగ్గజ జట్టుగా కొనసాగుతున్న ఇంగ్లాండుకు సొంతగడ్డపైనే షాక్ ఇచ్చింది. అప్పటికే న్యూజిలాండ్ పై మూడు టెస్టులు ఇక ఇండియా పై ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న ఇంగ్లాండ్ జట్టుకు టీమిండియా ఊహించని షాక్ ఇచ్చింది అని చెప్పాలి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా టి20 సిరీస్ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. అయితే మొదటి టి20 మ్యాచ్ లైవ్ అద్భుతమైన ప్రదర్శన తో 50 పరుగుల తేడాతో విజయం సాధించింది అనే విషయం తెలిసిందే.



 అయితే టి20లో ఓటమి చవిచూసిన ఇంగ్లాండ్ జట్టు రెండో టీ20లో పుంజుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో భారత బౌలింగ్ విభాగం మొత్తం విజృంభించింది. దీంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ విభాగం మొత్తం పేకమేడలా కూలిపోయింది అని చెప్పాలి. దీంతో టీమ్ ఇండియా ఇంగ్లాండ్ ముందు ఉంచిన 170 పరుగుల ఒక మోస్తరు లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడింది ఇంగ్లాండ్. రెండో టి20 మ్యాచ్ లో విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది టీమిండియా. ఈ క్రమంలోనే భారత అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.


 ఇక రెండో మ్యాచ్లో విజయం పై స్పందించిన రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుపై గెలవడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. టి20ల్లో పవర్ ప్లే ఎంతో ముఖ్యమని.. అందుకే వేగంగా రొమాన్స్ చేయడం వికెట్లు తీయడం పై ప్రత్యేకమైన ఎఫర్ట్ పెట్టాము అంటూ చెప్పుకొచ్చాడు.. ఇక చివర్లో జడేజా ఒత్తిడిలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక మూడవ టి20 మ్యాచ్ లో రిజర్వ్ బెంచ్ కి ఛాన్స్ తీస్తామని.. దీనిపై కోచ్ మాట్లాడాల్సి ఉంది అంటూ చెప్పుకొచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: