
యో యో టెస్టు లో పాల్గొని ఇక తమ ఫిట్నెస్ను నిరూపించుకున్న ఆటగాళ్లకు మాత్రమే టీమిండియాలో అవకాశం కల్పిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆటగాళ్ళ వయస్సు ను కచ్చితంగా నిర్ధారించేందుకు సరికొత్త పద్ధతిని తీసుకువచ్చేందుకు నిర్ణయించింది అన్నది తెలుస్తుంది. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇలా ఆటగాళ్ళ వయస్సు నిర్ధారించేందుకు సరికొత్త సాఫ్ట్వేర్ కనుగొనడం పై భారత క్రికెట్ నియంత్రణ మండలి దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
అయితే ఇప్పుడు వరకు వినియోగిస్తున్న పద్ధతి స్థానంలో బోన్ ఎక్స్పర్ట్ అనే సాఫ్ట్ వేర్ ని ఉపయోగించి ఖచ్చితమైన ఫలితాలను సాధించాలని బీసీసీఐ భావిస్తోందట. ఈ క్రమంలోనే ఈ సరికొత్త సాఫ్ట్వేర్ పై బీసీసీఐ దృష్టి పెట్టిందట. tw3 పద్ధతిలో వయసు నిర్ధారణకు 2400 రూపాయలు ఖర్చు అవుతుంది. అంతేకాదు ఇక ఈ పద్ధతి పూర్తికావడానికి మూడు నుంచి నాలుగు రోజులు సమయం పట్టేది. బీసీసీఐ తీసుకురావాలనుకుంటున్న కొత్త సాఫ్ట్వేర్ లో వయసు నిర్ధారణకు కేవలం కేవలం రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందట. వేగంగా వయసు నిర్ధారణ చేపట్టవచ్చు. ఈ పద్ధతి వినియోగానికి బిసిసీఐ ప్రతిపాదనలు సిద్ధం చేసింది..