గత కొంత కాలం నుంచి టీమిండియా ఆటగాళ్లు విషయంలో అటు కరోనా వైరస్ పగబట్టినట్లు గానే వ్యవహరిస్తూ ఉంది. ఒక వైపు భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణించాలని పట్టుదలతో ఉంటే చివరికి కరోనా వైరస్ బారిన పడుతూ ఆటకు దూరం అవుతూ ఉండడం కూడా ఇటీవలి కాలంలో జరుగుతూ ఉంది. క్రికెట్  దగ్గర్నుంచి అన్ని క్రీడల వరకు కూడా టీమిండియా ఆటగాళ్లు వరుసగా వైరస్ బారిన పడుతూ ఉండడం ఆందోళనకు కారణం అవుతుంది అనే విషయం తెలిసిందే. ఇప్పుడు కామన్ వెల్త్ క్రీడల్లో భాగంగా టీమిండియా తరఫున బరిలోకి దిగిన క్రీడాకారులను కరోనా వైరస్ వెంటాడుతూనే ఉంది అన్నది తెలుస్తుంది.


 కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్ కు మొదటి సారి అవకాశం వచ్చింది. దీంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారత మహిళల జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. కానీ అంతకుముందే కరోనా వైరస్ వెంటాడటం తో కొంత మంది క్రీడాకారులు జట్టుకు దూరమయ్యారూ అన్న విషయం తెలిసిందే. ఇలా కరోనా వైరస్ అటు మహిళల క్రికెట్ జట్టును ఇబ్బందుల్లో పడేయ్యగా.. ఇక ఇప్పుడు భారత మహిళల హాకీ జట్టు  విషయంలో కూడా ఇదే జరిగింది అన్నది తెలుస్తుంది. కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొంటున్న భారత హాకీ జట్టు లో కూడా కరోనా కలవరం మొదలైంది.

 భారత మహిళల హాకీ జట్టు మిడ్ ఫీల్డర్ నవ్ జ్యోత్ కౌర్ కి కరోనా పాజిటివ్ గా తేలింది. భారత మహిళల హాకీ జట్టుకు ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. దీంతో మిగతా క్రీడాకారులకు దూరంగా ఆమెను ఐసొలేషన్ లో ఉంచారు నిర్వాహకులు. మరో రెండు రోజుల తర్వాత ఆమెకు మరోసారి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తామని చెప్పారు. అప్పటికి కూడా నెగిటివ్ రిపోర్టులు రాకపోతే ఇక సదరు క్రీడాకారిణిని తిరిగి భారత్ పంపిస్తాము అంటూ నిర్వాహకులు చెప్పడం గమనార్హం. అయితే ఇక కీలకమైన ప్లేయర్ దూరమైన నేపథ్యంలో భారత హాకీ జట్టు ఎలా రాణిస్తోంది అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: