ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో భాగంగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా టి20 సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ వన్డే సిరీస్ గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా  టి20 సిరీస్ ను అదే జోరులో ప్రారంభించింది. ఈ క్రమంలోని మొదటి మ్యాచ్లో 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియాకు తిరుగులేదని.. రెండో మ్యాచ్లో కూడా విజయం సాధించి సిరీస్ అలవోకగా కైవసం చేసుకుంటుందని అందరు అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో  రెండో మ్యాచ్ లో మాత్రం  ఓటమి చవిచూసింది టీమిండియా.


 ఆతిథ్య వెస్టిండీస్ జట్టు పుంజుకోవడంతో టీమిండియా బ్యాటింగ్ విభాగం ఏమీ చేయలేక పోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఐదు వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది వెస్టిండీస్ జట్టు. రెండో టీ20 మ్యాచ్లో భాగంగా వెస్టిండీస్ బౌలర్ మెక్కాయ్ ఇండియాతో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్లో బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. వర్షం కారణంగా మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే టీమిండియా ఆటగాళ్ళను వెస్టిండీస్ బౌలర్ మెకాయ్ ముప్పుతిప్పలు పెట్టాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 తన టి20 కెరియర్ లోనే బెస్ట్ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. మొత్తంగా నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చిన మెక్కాయ్ ఏకంగా ఒక మెయిడిన్ సహా ఆరు వికెట్లు పడగొట్టాడు. ఏకంగా భారత్ బ్యాటింగ్ విభాగం నడ్డి విరిచాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అతని బౌలింగ్ కి చేతులెత్తేసిన టీమిండియా బ్యాట్స్మెన్లూ పెవిలియన్ బాట పట్టారు. ఇలా రెండో టీ20 మ్యాచ్ లో  జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మెక్కాయ్ ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా అవార్డును అందుకున్నాడు.. అదే సమయంలో పలు రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.


 టి20 క్రికెట్ లో ఆరు వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ ఘనత నలుగురు బౌలర్లు అందుకున్నారు. దీపక్ చాహర్,  అజంతా మెండిస్,  చాహల్, ఆస్టన్  ఈ రికార్డును అందుకోవడం గమనార్హం. అయితే టీమిండియాపై టీ20 లో బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసిన బౌలర్లలో మెకాయ్ తొలి స్థానంలో నిలిచాడు అని చెప్పాలి.  అంతకు ముందు వానిందు హాసారంగా 4 వికెట్లు, మిచేల్ శాన్ట్నర్ నాలుగు వికెట్లు, డారెల్ సామి నాలుగు వికెట్లతో తర్వాత స్థానంలో ఉన్నారు. వెస్టిండీస్ తరఫున టి20 లలో  బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు ఎవరూ కూడా ఇలా ఎవరూ కూడా వెస్ట్ఇండీస్ తరఫున ఆరు వికెట్లు తీయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: