పకడ్బంద ప్రణాళికలతో ఆసియా కప్లో భాగంగా బరిలోకి దిగిన టీమిండియా ఇక మొదటి మ్యాచ్లోనే విజయం సాధించి శుభారంభం చేసింది. టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఎంతో జోరు మీద ఉంది అనే చెప్పాలి. గత కొంతకాలం నుంచి వరుస సిరీస్ లను గెలుచుకున్న టీమిండియాను ఇక ఇప్పుడు ఆసియా కప్ లో కూడా ఇదే జోరు కొనసాగించడానికి సిద్ధంగా ఉంది. అయితే మొదటి మ్యాచ్ గెలిచిన జోష్ లోనే ఆ తర్వాత పసికునా హాంకాంగ్ తో ఆడబోతుంది.  అయితే ఇప్పటివరకు ఆసియా కప్లో భాగంగా టీమిండియా, హాంకాంగ్ మధ్య రెండుసార్లు మ్యాచ్ జరిగింది. 2008లో ఒకసారి 2018లో రెండోసారి. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.


 2008లో ఎంతో సునాయాసంగా గెలిచింది భారత జట్టు. కానీ 2018 లో మాత్రం హాంకాంగ్ పై విజయం అంత సులభంగా రాలేదు. ఒక రకంగా చెప్పాలంటే టీమిండియాకు పసికునా హాంకాంగ్ ముచ్చెమటలు పట్టించింది. దాదాపు ఓటమి అంచుల వరకూ వెళ్లిన టీమిండియా చివరి నిమిషంలో అదృష్టవశాత్తు విజయం సాధించి పరువు కాపాడుతుంది. అయితే హాంకాంగ్ చెట్టుజట్టును తక్కువ అంచనా వేయడం కారణంగానే ఇలా జరిగిందని అప్పట్లో ఎంతో మంది టీమిండియా పై విమర్శలు చేశారు. అయితే ఇక ఇప్పుడు కూడా హాంకాంగే కదా అని తక్కువ అంచనా వేస్తే మాత్రం ఇండియా కు పరాభవం తప్పదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


 అప్పుడు మ్యాచ్ లో 50 ఓవర్ లలో ఏడు వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది భారత్. 285 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన హాంకాంగ్ ఓపెనర్లు అద్భుతంగా పోరాడారు. ఏకంగా  ఓపెనర్ లు 174 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 35 వ ఓవర్ వరకు  ఒక్క వికెట్ కూడా దొరకలేదు. కానీ ఆ తర్వాత తొలి వికెట్ కోల్పోయిన హాంకాంగ్ వరుసగా బ్యాటింగ్ విభాగం పేకమేడలా కూలిపోయింది. 269 పరుగులకు ఆలౌట్ అయింది. హాంకాంగ్ ఓడిపోయినప్పటికీ వారు చూపిన పోరాట ప్రతిభ మాత్రం ప్రేక్షకుల మనసు గెలుచుకుంది ఇప్పుడు హాంకాంగ్ తో మ్యాచ్ అంటే టీమిండియా తమదైన వ్యూహాలతో బరిలోకి దిగితే బెటర్ అంటూ ఎంతో మంది విశ్లేషకులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: