బిగ్ బాస్ తెలుగు.. ఆరో సీజన్ ప్రారంభానికి అంతా సిద్ధమైంది. మరోసారి బుల్లితెర ప్రేక్షకులకు అంతకుమించి అనే రేంజ్ లోనే అలరించేందుకు సిద్ధమైన బిగ్బాస్ కార్యక్రమం ఇప్పటికే ఐదు సీజన్లు ఎంతో సక్సెస్ఫుల్గా ముగిసాయి. కాగా 3 సీజన్ల  నుంచి కూడా కింగ్ నాగార్జున తన హోస్టింగ్ తో బిగ్ బాస్ కు స్పెషల్  ఎట్రాక్షన్ గా మారిపోయాడు  అన్న విషయం  తెలిసిందే ఇక ఇప్పుడు  ఆరవ సీజన్కు కూడా నాగార్జున హోస్టింగ్ చేయబోతున్నారు అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి ఎంటర్టైన్మెంట్  డబుల్ డోస్ దోస్త్ ఉండబోతుంది అని నాగార్జున  ఇప్పటికే చెప్పారు.

 ఇక బిగ్బాస్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో  వరుసగా విడుదల చేస్తూ  ఉండడంతో అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి అని చెప్పాలి. అయితే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోకి  వెళ్లబోయే కంటెస్టెంట్ ఎవరు అన్న దానిపై ఒక క్లారిటీ వచ్చింది అన్నది తెలుస్తుంది.. కాగా ఈ రోజు సాయంత్రం గ్రాండ్ ఓపెనింగ్ కు అంతా రెడీ అయింది. కానీ ఈ  సారీ బిగ్ బాస్  ఆరో సీజన్ కు మాత్రం గడ్డు పరిస్థితులు తప్పేలా కనిపించడం లేదు. టీం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ప్రభావం నేడు బిగ్ బాస్ ఓపెనింగ్ రేటింగ్ పై పడే అవకాశం ఉంది.


 అయితే ప్రస్తుతం  ఆసియా కప్ ముగిసినప్పటికీ ఇక మరికొన్ని రోజుల్లోనే అటు వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. వరల్డ్ కప్ లో మ్యాచ్ ను చూసేందుకు ప్రేక్షకులు అందరూ తెగ ఆసక్తి చూపుతారు. తద్వారా ఇక బిగ్ బాస్ రేటింగ్  తక్కువయ్యే  అవకాశం ఉంది అని తెలుస్తుంది. అయితే గత కొన్ని సీజన్స్  నుంచి హౌస్ లో కొత్తగా ఏమీ లేకపోవడంతో.. కొంత మంది ప్రేక్షకులు ఇప్పటికే బిగ్బాస్ షో చూడడం పై కాస్త అనాశక్తితోనే ఉన్నారు అనేది తెలుస్తుంది. ఈ రొటీన్ రుద్రుడిని ఇంకెన్నాళ్లు చూడాలని అనుకుంటున్నారట  కొంతమంది.  ఇలాంటి సమయంలో ఇక వరల్డ్ కప్ కూడా ఉండడంతో బిగ్ బాస్ కి ఈసారి గడ్డుకాలం తప్పదు అన్నది మాత్రం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: