ప్రస్తుతం ఆసియా కప్ 2022 లో భాగంగా సూపర్ 4 మ్యాచ్ లు జరుగుతున్నాయి. కాగా నిన్న సాయంత్రం దాయాదులు అయిన పాకిస్తాన్ మరియు ఇండియాల మధ్యన ఆసియా కప్ లో రెండవ సారి తలపడ్డారు. మొదటి సారి తలపడగా ఇండియా జయభేరి మోగించింది... కానీ రాత్రి జరిగిన మ్యాచ్ లో మాత్రం పాకిస్తాన్ చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో గెలిచి బదులు తీర్చుకుంది. వాస్తవానికి ఈ మ్యాచ్ లో ఇండియానే ఫేవరెట్ గా బరిలోకి దిగింది. కానీ పాకిస్తాన్ పోరాటం ముందు ఇండియా ఓటమిని అంగీకరించక తప్పలేదు.

మొదట టాస్ గెలిచిన పాక్ ఇండియాకు బ్యాటింగ్ అప్పగించింది. ఇండియా కూడా మొదటి ఓవర్ లలో బాగా పరుగులు చేసినా కీలక సమయంలో వికెట్లు పోగొట్టుకుని కనీసం 180 అయినా చేస్తుందా అనుకున్న దశలో ఆఖరి రెండు బంతులకు ఫీల్డర్ తప్పిదం కారణంగా రెండు బౌండరీలు సాధించి జట్టు స్కోర్ ను 181 పరుగులకు చేర్చాడు స్పిన్నర్ రవి బిష్ణోయ్. మాములుగా అయితే ఇండియా ఉన్న ఫామ్ లో ఈ స్కోర్ తో ఖచ్చితంగా గెలుస్తుంది అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ పాకిస్తాన్ దాన్ని సాధ్యం చేసి చూపించింది. ఎప్పటిలాగే మరోసారి బాబర్ ఆజామ్ ఫెయిల్యూర్ కాగా... ఫఖార్ జమాన్ తో కలిసి రిజ్వాన్ స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించాడు.

కానీ అనవసర షాట్ కు ప్రయత్నించిన జమాన్ చాహల్ బౌలింగ్ లో కోహ్లీ కి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. అయితే ఇక్కడే పాకిస్తాన్ అద్భుతంగా ఆలోచించి బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చారు. ఎక్కడో ఆఖర్లో దిగాల్సిన నవాజ్ ను సెకండ్ డౌన్ లోకి తీసుకువచ్చారు. దీనికి కారణం అప్పుడు లెగ్ స్పిన్నర్ లు బౌలింగ్ వేస్తుండడంతో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉండాలని భావించిన పాక్ నవాజ్ ను ఒక అస్త్రంగా వాడింది. అయితే జట్టు యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నవాజ్ అద్భుతమైన బ్యాటింగ్ తో నిలబెట్టుకున్నాడు. ఇతను కేవలం 22 బంతుల్లో 6 ఫోర్లు మరియు 2 సిక్సర్ల సాయంతో పరుగులు 42 సాధించాడు. అప్పటికే  మ్యాచ్ పాక్ చేతిలోకి వచ్చేసింది. కానీ చివర్లో రిజ్వాన్ మరియు నవాజ్ లు అవుట్ కావడం తో కాస్త టెన్షన్ పడ్డా... మిగిలిన పన్ని అసిఫ్ అలీ మరియు ఖుష్ దిల్ షా ముగించారు.    

 


మరింత సమాచారం తెలుసుకోండి: