ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుతో టి20 సిరీస్ ఆడుతుంది టీమ్ ఇండియా జట్టు. ఈ క్రమంలోనే మొదటిమ్యాచ్లో ఓటమితో నిరాశపరిచిన టీమ్ ఇండియా జట్టు రెండవ మ్యాచ్లో మాత్రం విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ 1-1 తేడాతో సమం అయ్యింది. అయితే ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. అయితే ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ  భరితంగా సాగింది అని చెప్పాలి. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో 20 ఓవర్లకు బదులు 8 ఓవర్లకు మ్యాచ్ కుదించారు. ఇలాంటి సమయంలోనే 91 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోవడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి. అయితే విజయానికి 9 పరుగులు అవసరమైన సమయంలో క్రేజీ లోకి వచ్చిన దినేష్ కార్తీక్ వరుసగా 2 బంతుల్లో 6, 4 కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే బ్యాటింగ్లో రిషబ్ పంత్ కంటే ముందు దినేష్ కార్తీక్ ని పంపించడం పై అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మ్యాచ్ విజయం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్థిక్ పాండ్యా అవుట్ కావడంతో ఆఖరి ఓవర్ లో పంత్ లేదా దినేష్ కార్తీక్ లలో ఎవరిని బ్యాటింగ్కి పిలవాలి అనే విషయంపై కన్ఫ్యూజ్ అయ్యాను.


 కానీ నా దృష్టి మొత్తం దినేష్ కార్తీక్ పైనే ఉంది. ఎందుకంటే టి20 ప్రపంచ కప్ లో అతను మాకు ఫినిషిర్గ ఉపయోగపడబోతున్నాడు. ఈ సమయంలో కార్తీక్ అవసరం అనిపించింది. అందుకే పంత్ కంటే ముందు దినేష్ కార్తీక్ ను బ్యాటింగ్ కి పిలిచాను అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. ఇక తన బ్యాటింగ్ ప్రదర్శన పై స్పందిస్తూ నా ప్రదర్శన నాకే సర్ప్రైజ్ అనిపించింది. గత కొన్ని నెలలుగా ఇలాంటి హిట్టింగ్ కోసమే ఎదురుచూస్తున్నా.. దూకుడుగా ఆడాలని ప్లాన్ చేసుకొని రాలేదు. కానీ కాస్త కుదురుకున్నాక బ్యాట్ కు పని చెప్పాలని అనుకున్నాను. కానీ 8 ఓవర్ల మ్యాచ్ కావడంతో ఆరంభం నుంచి ఇన్నింగ్స్ దాటిగా ఆడాల్సి వచ్చింది. అందుకే పరుగులు చేయడం కంటే బౌండరీలు కొట్టడం పైన ఎక్కువ దృష్టి పెట్టాను అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: