అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్ నేపథ్యంలో ఈసారి విశ్వవిజేతగా నిలవడమే లక్ష్యంగా టీమిండియా పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. టి20 వరల్డ్ కప్ కోసం అత్యుత్తమ ఆటగాళ్లని ఎంపిక చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపద్యంలో టీం ఇండియా ప్రణాళికలు మొత్తం తారుమారు అవుతున్నాయ్. టీమిండియా కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఈసారి ఎలాగైనా విశ్వవిజేతగా నిలవాలని దృఢ సంకల్పంతో ఉన్న టీమిండియా కు అటు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరం అవుతూ ఉండడం జట్టును కాస్త బలహీనంగా మారుస్తూ ఉంది అని చెప్పాలీ. మొన్నటికి మొన్న జట్టులో కీలక ఆల్ రౌండర్ గా ప్రత్యర్ధుల  ఓటమి శాసించిన ప్లేయర్గా జట్టులో కొనసాగిన రవీంద్ర జడేజా మోకాలు గాయం కారణంగా చివరికి జట్టుకు దూరమయ్యాడు. ఇక జడేజ అలాంటి కీలక ఆటగాడు లేకపోయినా బుమ్రా ఉన్నాడు ఏదైనా అటు ఇటు అయితే అతను చూసుకుంటాడులే అనే నమ్మకం ప్రేక్షకులలో ఉండేది.


 గాయం బారిన పడిన బుమ్రా కోలుకొని మళ్ళీ జట్టుతో చేరాడు. ఇక తాను ఆడిన మ్యాచ్లలో అదరగొట్టాడు. కానీ అంతలోనే మళ్లీ బుమ్రా వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరం అయ్యాడు అన్నది తెలుస్తుంది. తద్వారా టి20 ప్రపంచ కప్ కి కూడా అందుబాటులో ఉండడం కష్టమే అన్నది తెలుస్తుంది. దీంతో బుమ్రా ఉన్నాడనే ధైర్యం కూడా క్రికెట్ ఫాన్స్ లో లేకుండా పోయింది. ఒక బెస్ట్ బౌలర్.. ఒక బెస్ట్ ఆల్ రౌండర్ జట్టుకు దూరం కావడంతో ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇక  ఈ ఇద్దరు లేకుండా టి20 వరల్డ్ కప్ లో కప్పు కొట్టడం కష్టమే ఉంటే కొంతమంది కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: