భారత పర్యటనకు వచ్చిన సౌత్ ఆఫ్రికా తో వరుసగా సిరీస్ లు ఆడుతుంది భారత జట్టు. అయితే ఇటీవల ప్రధాన జట్టుతో టి20సిరీస్ ఆడగా.. ఇక టి20 సిరీస్ లో రెండు విజయాలతో సిరీస్ కైవసం చేసుకుంది టీమ్ ఇండియా. వరల్డ్ కప్ నేపథ్యంలో సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో ఇక అటు వరల్డ్ కప్ లో సెలెక్ట్ కానీ ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో ఉన్నా జట్టు ప్రస్తుతం సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల లక్నో వేదికగా టీమిండియా సౌత్ ఆఫ్రికా మధ్య మొదటి టి20 మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే.


 నువ్వా నేనా అన్నట్లుగా ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరికి భారత జట్టు 9 పరుగుల తేడాతో పరాజయం  పాలయింది. సంజు శాంసన్ ఆఖరి వరకు జట్టును గెలిపించేందుకు పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతపురం జట్టు ఓటమిపై స్పందించిన తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము అనుకున్న ప్రణాళిక ప్రకారం ఆడ లేకపోయాము అంటూ చెప్పుకొచ్చాడు. కానీ తమ ఆటగాళ్లు పోరాటం మాత్రం ఎంతగానో ఆకట్టుకుందని తెలిపాడు.


 మేము మంచి ఆరంభం అందుకోలేకపోయాం. అయినప్పటికీ సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్ శార్దూల్ ఠాగూర్ అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టును విజయం అంచుల వరకు తీసుకువెళ్లారు. అయితే బౌలింగ్కు అనుకూలంగా లేని పిచ్ కావడంతో మేము ధారాళంగా పరుగులు సమర్పించాం. చెత్త ఫీలింగ్ కూడా మా ఓటమిని శాసించింది. ఇక ఈ ఓటమి మాకు ఒక గుణపాఠం లాంటిది అంటూ శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు. కాగా టీ20 సిరీస్ చేజిక్కించుకున్న రోహిత్ సేన ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ కోసం ప్రయాణం కాగా.. ఇక దావన్ నేతృత్వంలోని భారత జట్టుకు శుభారంభం  లభించలేదు. మరి తర్వాత మ్యాచ్ లలో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: