బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో టి20 ఫార్మాట్ కు ఊహించని రీతిలో క్రేజ్ వచ్చింది అంటే అది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగానే అని చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్ లో ఏ దీశీయ లీగ్ కి లేనంతగా అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూ పాపులారిటీ ఉంది. ఇక గత ఏడాది ప్రసార హక్కుల వేలం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ రేంజ్ మరో స్థాయికి వెళ్ళిపోయింది అని చెప్పాలి.


 అయితే ఏకంగా విదేశీ క్రికెటర్లు సైతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవాలనుకునే ఎంతో మంది యువ ఆటకాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒక మంచి వేదికగా మారిపోయింది. ఒకవైపు ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యేందుకు డబ్బు అందించడమే కాదు మరోవైపు యువ క్రికెటర్లకు పేరు ప్రఖ్యాతలు కూడారావడానికి కారణం అవుతుంది ఐపీఎల్ అని చెప్పాలి. ఇకపోతే ఇప్పటికే ఈ ఏడాది ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ పంచింది. కాగా వచ్చే ఐపీఎల్ పై బీసీసీఐ కసరతులు ప్రారంభించింది.


 ఈ క్రమంలోనే ఐపిఎల్ 2023 సీజన్ కోసం ప్లేయర్స్ ఆక్షన్ కోసం డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ ఆరవ తేదీన ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం వేలం నిర్వహించేందుకు అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి సన్నాహాలు ప్రారంభించిందట. కాగా ఫ్రాంచైసీల వద్ద ఉన్న ప్లేయర్ల జాబితాను నవంబర్ 15 లోపు ఇవ్వాలి అని బిసిసిఐ కోరినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఐపీఎల్ 2022 సీజన్ వేలంలో 90 కోట్ల వరకు ప్రతి ఫ్రాంచైజీ ఖర్చు చేసేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోని ఇప్పుడు ఆ శాలరీ క్యాప్ 95 కోట్లకు పెంచింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: