ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా ప్రస్థానం ముగిసింది. లీగ్ దశలో అద్భుతమైన విజయాలు సాధించి అటు సెమీఫైనల్కు దూసుకుపోయిన టీమ్ ఇండియా జట్టు సెమీఫైనల్ లో మాత్రం ఇంగ్లాండ్కు పోటీ ఇవ్వలేక పోయింది. ఎప్పటి లాగానే ఓపెనర్లు విఫలం కావడం ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు కూడా పెద్దగా రాణించకపోవడం జరిగింది. ఇక లీగ్ దశ నుంచి టీమిండియాను ఆదుకుంటున్న హార్దిక్ పాండ్యా విరాట్ కోహ్లీ మరోసారి తమ ఇన్నింగ్స్ లతో ఇక తక్కువ పరుగులకే కట్టడి కావాల్సిన జట్టుకు ఒక గౌరవప్రదమైన స్కోరు అందించారు.


 ఏకంగా టీమిండియా 20 ఓవర్లలో 166 పరుగులు చేసింది. ఇక ఇలాంటి టార్గెట్ ను టీమిండియా లాంటి జట్టు ఎంతో అలవోకగా కాపాడుకోగలదు అని చెప్పాలి. అయితే లీగ్ దశ మ్యాచ్ లో మాత్రం ప్రత్యర్ధులపై నిప్పులు చెరిగిన భారత బౌలర్లు అటు కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో మాత్రం చేతులెత్తేశారు. అటు ప్రత్యర్థి జట్టును పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయాల్సింది పోయి సిక్సర్లు ఫోర్లు ఇచ్చి ఇక పరుగులను సమర్పించుకున్నారు అని చెప్పాలి. దీంతో ఒక వికెట్ కూడా పడగొట్టలేక పేలవమైన ప్రదర్శన చేశారు. తద్వారా ఏకంగా టీమిండియా పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇంగ్లాండు జట్టు.


 టీమ్ ఇండియా వైఫల్యానికి కారణం ఏంటి అన్నదానిపై విశ్లేషకులు ఎన్నో రివ్యూలు ఇస్తున్నారు. ముఖ్యంగా సెమీఫైనల్ లో టీమిండియా చేసిన ఒక పెద్ద తప్పిదమే ఇక జట్టు ఓటమికి కారణమైనట్టు కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. అక్షర్ పటేల్ స్థానంలో స్పిన్నర్ చాహాల్ ను ఆడించి ఉంటే తప్పకుండా ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లాండు రిస్ట్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ నాలుగో ఓవర్లు వేసి 20 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన సూర్య కుమార్ వికెట్ పడగొట్టాడు. మరో స్పిన్నర్ లివింగ్ స్టోన్ మూడు ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. కానీ భారత స్పిన్నర్లు అక్షర్ అశ్విన్ లు మాత్రం తేలిపోయారు. అదే రిస్ట్ స్పిన్నర్ చాహల్ కు ఛాన్స్ ఇచ్చి ఉంటే అతను ఎంతో కీలక పాత్ర వహించేవాడని.. అతనికి ఆ సత్తా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: