బిసిసిఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అటు ఆస్ట్రేలియా ప్లేయర్లు ఎంతల హవా కొనసాగిస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ జట్టులో కొనసాగినప్పటికీ అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అంతేకాదు ఇక ఆస్ట్రేలియా జట్టులో స్టార్ పేర్లుగా ఉన్న ఎంతో మందికి ఆటగాళ్లకు అటు ఐపీఎల్ కారణంగా భారత అభిమానులతో కూడా ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ అయితే ఇండియా తన రెండో ఇల్లు అంటూ చెబుతూ ఉండడం కూడా ఎన్నోసార్లు చూశాం.



 ఇకపోతే 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూ సంబంధించిన చర్చలు ఇప్పటినుంచి జరుగుతూ ఉండగా.. ఇక మరికొన్ని రోజుల్లో మినీ వేలం కూడా జరగబోతుంది.. ఇప్పటికే ఇక అన్ని ఫ్రాంచైజీలు కూడా తమ జట్టు నుంచి వదులుకోబోతున్న ఆటగాళ్ల వివరాలను బీసీసీఐకి సమర్పించాయి. అదే సమయంలో ఇక తమ జట్టును అంటిపెట్టుకున్న ఆటగాళ్ల డీటెయిల్స్ ని కూడా అందించాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే మినీ వేలం మరోసారి ఆసక్తికరంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో కొంతమంది స్టార్ ప్లేయర్స్ ఐపీఎల్ కు దూరం కాబోతున్నారు అన్న వార్తలు మాత్రం వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఐపిఎల్ సీజన్ కి ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు స్టార్ ప్లేయర్లు దూరం కాబోతున్నారట. ఒకవైపు అన్ని ఫ్రాంచైజీలు   తమ జట్టులో ఉన్న ఆటగాళ్లను మార్చుకుని ఇక జట్టును మరింత పటిష్టం చేసుకోవాలనుకునే పనిలో నిమగ్నమై ఉండగా.. మరోవైపు వివిధ కారణల వల్ల ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్ లో ఆడబోమని తేల్చి చెబుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇలా ఐపిఎల్ కు దూరం కాబోతున్న స్టార్ ప్లేయర్స్ లో ఆస్ట్రేలియా నుంచి మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్,  అరోన్ ఫించ్ లు కూడా ఉన్నారు అన్నది తెలుస్తుంది.. ఇప్పటికే తన ఐపీఎల్ క దూరంగా ఉంటున్నట్టు  ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్స్ సామ్ బిల్లింగ్స్ కూడా స్పష్టం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl