టి20 ఫార్మాట్ అంటేనే ఎన్నో అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. ప్రేక్షకులు ఒకటి అనుకుంటే టి20 ఫార్మాట్లో మాత్రం మరొకటి జరుగుతూ ఉంటుంది. అందుకే ఊహ కందని ట్విస్టులు  ఉంటాయి కాబట్టే నానాటికి అటు టి20 ఫార్మాట్ కి ప్రపంచక్రికెట్లో ఆదరణ అంతకంతకు పెరిగిపోతుంది అని చెప్పాలి. ఇక క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో జరిగే కొన్ని ఆసక్తికర ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఇటీవలే న్యూజిలాండ్తో జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో కూడా ఇలాంటిదే జరిగింది.


 భారీ పరుగులు చేస్తాడు అనే అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ ను దురదృష్టం వెంటాడింది అని చెప్పాలి. ప్రేక్షకుల ఊహకందని విధంగా శ్రేయస్ అయ్యర్ వికెట్ కోల్పోయి పెవిలియన్ చేరాడు. ఏకంగా హిట్ వికెట్ గా వెనదిరిగాడు అని చెప్పాలి. టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో 13 ఓవర్ వేసిన న్యూజిలాండ్ బౌలర్ ఫెర్క్యూసన్ బౌలింగ్ లో శ్రేయస్ అయ్యర్ ఇలా హిట్ వికెట్ అయ్యాడు. పెర్గ్యూసన్ వేసిన బంతిని డీప్ స్క్వేర్ లెగ్ దిశగా ఆడటానికి ప్రయత్నించాడు అయ్యర్.


 కానీ ఆ షాట్ ఆడే ప్రయత్నంలో నియంత్రణ కోల్పోయాడు అని చెప్పాలి. దీంతో కాలితో స్టంప్స్ ను పడగొట్టేసాడు. ఇంకేముంది అక్కడ ఉన్న అంపైర్ హిట్ వికెట్ గా చేతులు పైకెత్తేసాడు. ఇక ఇదంతా చూసిన శ్రేయస్ అయ్యర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇక చేసేదేమీ లేక నిరాశతో పేవిలియన్ చేరాడు అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా శ్రేయస్ అయ్యర్ 13 పరుగులు సాధించాడు అని చెప్పాలి. ఇకపోతే శ్రేయస్ అయ్యర్ హీట్ వికెట్ గా వెనుదిరిగిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: