ఇటీవల న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా శుభారంభం చేసింది అన్న విషయం తెలిసిందే. హార్థిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా జట్టు ఇక టి20 సిరీస్ ను కైవసం చేసుకుంది. అది కూడా ఒకే ఒక మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ దక్కించుకోవడం గమనార్హం. అయితే మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ క్రమంలోనే సిరీస్ గెలవాల్సిన జట్టు వరుసగా రెండు మ్యాచ్ లు గెలవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే రెండో మ్యాచ్ లో భారత జట్టు  అద్భుతంగా రాణించడంతో అలవోకగా 65 పరుగులు తేడాతో విజయం సాధించింది.


 అయితే ఇటీవలే మూడో మ్యాచ్లో కూడా న్యూజిలాండ్ జట్టు 160 పరుగులకు ఆల్ అవుట్ కాగా.. ఆ తర్వాత లక్ష్య  చేదనకు దిగిన భారత జట్టు 9వ ఓవర్ ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 75 పరుగులు మాత్రమే చేసింది. అంతలోనే వర్షం కురవడంతో మ్యాచ్ ఆగిపోయింది. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్ టై అని ప్రకటించారు ఎంపైర్లు. అయితే ఈ నిబంధన ప్రకారం చూసుకుంటే మ్యాచ్ ఆగిపోయిన సమయానికి భారత జట్టు 76 పరుగులు చేసి ఉంటే గెలిచింది. కానీ 75 పరుగుల వద్ద ఇక టీమిండియా ఆగిపోయింది అని చెప్పాలి. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో ఒక్క పాయింట్ తో సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా.


 అయితే న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ చేసిన చిన్న తప్పిదమే ఇక జట్టు పాలిట శాపంగా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా మ్యాచ్ తో పాటు సిరీస్ కూడా కోల్పోయే పరిస్థితిని తీసుకువచ్చింది అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. వర్షం కారణంగా భారత ఇన్నింగ్స్ ఆగిపోయే సమయానికి కేవలం క్షణాల ముందు 9 ఓవర్ లో ఆఖరి బంతిని ఐస్ సౌది బౌలింగ్లో మిచెల్ శాంట్నర్ మిస్ ఫీల్డింగ్ చేశాడు. దీపక్ హుడా ఆడిన షాట్ ను మిస్ ఫీల్ చేయడంతో ఒక పరుగు అదనంగా వచ్చింది. ఇదే న్యూజిలాండ్ కొంపముంచింది. ఒకవేళ అతను మిస్ ఫీల్డ్ చేయకపోయి ఉంటే టీమిండియా స్కోర్ 74 గా ఉండేది. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం అటు విజేతగా ప్రకటించారు. కానీ అతను చేసిన చిన్నతప్పిదం ఇక చివరికి జట్టును నిండా ముంచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: