ప్రస్తుతం ఖాతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభమైంది. ఇక ఈ వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా జరుగుతుంది అని చెప్పాలి. సాధారణంగా ఇలాంటి మెగా టోర్నీ ప్రారంభమైనప్పుడు ఛాంపియన్ జట్లు మరోసారి తమ ఆదిపత్యాన్ని కొనసాగించి ఇక టైటిల్ పోరులో ముందు ఉంటాయని ప్రేక్షకులు అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ లో మాత్రం ఇక ప్రేక్షకుల అంచనాలు తలకిందులు అవుతున్నాయి అని చెప్పాలి. ఎందుకంటే ఛాంపియన్ జట్లు ఓటములతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏర్పడింది.


 ఈ క్రమంలోనే తొలి మ్యాచ్ లో సౌదీ అరేబియా చేతిలో దారుణమైన ఓటమిని చవిచూసిన ఛాంపియన్ అర్జెంటీనా జట్టు ఇక ప్రస్తుతం వరల్డ్ కప్ లో పరిస్థితులను ఎంతో క్లిష్టంగా మార్చుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన అర్జెంటినా జట్టు ఇక వరల్డ్ కప్ లో నిలబడాలి అంటే తర్వాత మ్యాచ్లలో తప్పక గెలవాల్సి ఉంది అని చెప్పాలి. ఊహించని రీతిలో సౌదీ అరేబియా చేతిలో ఓడిపోయింది మెస్సి సేన.


 ఇకపోతే ఇక ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా అర్జెంటీనా జట్టు ఇక కీలక మ్యాచ్లో మెక్సికోతో తలబడబోతుంది అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ ఛాంపియన్ అర్జెంటీనా కు డు ఆర్ డై మ్యాచ్ గా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తేనే అర్జెంటీనా నాకౌట్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఓడిపోయింది అంటే మాత్రం ఛాంపియన్  అర్జెంటీనా జట్టు గ్రూప్ దశ నుంచే ఇక టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పాత గణాంకాలు చూసుకుంటే ఇప్పటివరకు వరల్డ్ కప్ లో ఈ రెండు జట్ల మధ్య మూడుసార్లు మ్యాచ్ జరగగా ఇక అర్జెంటీనానే విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: