టీ 20 వరల్డ్ కప్ ఛాంపియన్ గా నిలిచిన ఇంగ్లాండ్ ఇప్పుడు పాకిస్తాన్ పర్యటనలో టెస్ట్ సిరీస్ ఆడదానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో మొత్తం మూడు టెస్ట్ లు ఆడనుండగా, మొదటి టెస్ట్ రావల్పిండి లో రెండు రోజుల నుండి స్టార్ట్ అయింది. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇంగ్లాండ్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుని మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఫ్రెష్ పిచ్ పైన ఇంగ్లాండ్ ఆటగాళ్లు వీర విజృంభణ చేశారు. ఈ టెస్ట్ ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఒక్కసారిగా మనము చూస్తోంది వన్ డే లేదా టీ 20 నా అన్న సందేహం కలగక మానదు. ఇంగ్లాండ్ టీం లో మొదటి రోజు నలుగురు ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేయడం ఒక రికార్డ్ గా నిలిచింది.

ఇది మాత్రమే కాకుండా 112 సంవత్సరాలుగా టెస్ట్ మొదటి రోజు అత్యధిక స్కోర్ ను కూడా వీళ్ళు తుడిచిపెట్టారు. కేవలం ఒక్క రోజులోనే 506 పరుగులు చేసి ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డ్ ను అధిగమించారు. ఇక రెండవ రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్ జోరుగా పరుగులు చేయడానికి ఉత్సాహం చూపించింది. ముఖ్యంగా హ్యారి బ్రూక్ అయితే ఆకాశమే హద్దుగా చేలరేగి పాకిస్తాన్ బౌలింగ్ ను తుత్తునియలు చేశాడు. ఇక ఇన్నింగ్స్ 83 వ ఓవర్ లో జాహిద్ మహమ్మద్ బౌలింగ్ లో మొత్తం 27 పరుగులు చేశాడు... ఆ ఓవర్ లో మూడు ఫోర్లు , రెండు సిక్సులు కొట్టి మాన్ స్టర్ ఇన్నింగ్స్ ను తలపించాడు.. అలా టెస్ట్ లలో మొదటి 150 ను చేరుకున్నాడు.

ఇతను వచ్చిన ప్రతీ బంతిని బౌండరీ కొట్టడానికి చూశాడు. ఇక చివరగా 153 పరుగుల వద్ద నసీం షా బౌలింగ్ లో షకీల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కాగా బ్రూక్ కు కెరీర్ లో ఇది రెండవ టెస్ట్ మాత్రమే. అయితే అతనిలో అంత పరిపక్వత కలిగిన ఆటను ఉండడం నిజంగా ఇంగ్లాండ్ అదృష్టం అని చెప్పాలి. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోర్ 600 పరుగులు దాటింది.      

మరింత సమాచారం తెలుసుకోండి: