తన కోర చూపులతో సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్గా మారిపోతుంది. ఇక స్మృతి మందాన ఒక్క చిరునవ్వు నవ్వింది అంటే చాలు ఎంతోమంది యువకులు మనసు పారేసుకుంటారు అని చెప్పాలి. ఇలా స్మృతి మందాన ఏదైనా పోస్ట్ పెట్టిందంటే చాలు అది అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇకపోతే ఇప్పటివరకు క్రికెటర్ గా కూడా ఎన్నో రికార్డులను సాధించిన స్మృతి ఇంకా పరుగుల వరద పారిస్తూనే ఉంది. ఇకపోతే పెరియార్ లోనే పిక్ ఫామ్ లో కొనసాగుతున్న స్మృతి మందాన ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన మహిళల టి20 ర్యాంకింగ్స్ లో అదరగొట్టింది అని చెప్పాలి. తన కెరీర్ లోనే బెస్ట్ ర్యాంకును సొంతం చేసుకుంది. దీంతో అభిమానులందరూ ఆనందంలో మునిగిపోయారు.
ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో ఏకంగా 74 పాయింట్ల తో మూడవ స్థానానికి చేరుకుంది స్మృతి మందాన. ఇక ఈ లిస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ అయిన తహీల మెక్ గ్రోత్ తొలి స్థానాన్ని సొంతం చేసుకుంది అని చెప్పాలి. భారత్కు చెందిన షఫాలీ వర్మ ఆరవ స్థానంలో నిలువగా, రోడ్రిక్స్ ఇక తొమ్మిదవ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇంకోన్నాళ్లపాటు స్మృతి మందాన ఇక ఇలాంటి అద్భుతమైన ఫామ్ కొనసాగించింది అంటే ఇక వరల్డ్ నెంబర్వన్ బ్యాటర్ గా మారడం ఖాయమని ఎంతోమంది అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి