ప్రస్తుతం భారత జట్టులో సీనియర్ బౌలర్గా కొనసాగుతూ ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. అయితే అశ్విన్ ఎంతో తెలివైన స్పిన్నర్ అని ఎప్పుడూ క్రికెట్ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. అయితే క్రికెట్ విశ్లేషకులు చెప్పడమే కాదు అతడు మ్యాచ్ లో బౌలింగ్ చేస్తూ తన స్పిన్ తో ప్రత్యర్థులను తికమక పెడుతూ ఉండడం చూసి ప్రేక్షకులకు కూడా ఇది అర్థమవుతూ ఉంటుంది అని చెప్పాలి. క్లిష్ట సమయాల్లో మిగతా బౌలర్లు అందరూ చేతులెత్తేసిన టైంలో కూడా రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేస్తూ ఉంటాడు అని చెప్పాలి.


 ఇక విభిన్నమైన బౌలింగ్ యాక్షన్ కలిగి ఉండే రవిచంద్రన్ అశ్విన్ అదరగొడుతూ ఉంటాడు. అయితే అందరిలాగానే ఒక సాదా సీదా స్పిన్నర్ గా జట్టులోకి అరంగేట్రం చేసిన రవిచంద్రన్ అశ్విన్ ఇక ఇప్పుడు ఏకంగా ఆల్రౌండర్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఒకవైపు స్పిన్ బౌలింగ్ తో వికెట్లు పడగొడుతూనే మరోవైపు తన బ్యాటింగ్ తో కీలకమైన సమయంలో పరుగులు చేస్తూ జట్టుకు విజయాన్ని అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏకంగా టెస్ట్ క్రికెట్లో ఐదు సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నాడు అశ్విన్. తనదైన రోజు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ లాగే అశ్విన్ చెలరేగిపోతూ ఉంటాడు అని చెప్పాలి. బంగ్లాదేశ్ తో జరిగిన రెండవ టెస్ట్ చివరి ఇన్నింగ్స్ లో కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు.


 ఈ క్రమంలోనే రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ప్రపంచ రికార్డును కూడా సృష్టించాడు అని చెప్పాలి. టెస్ట్ ఫార్మాట్లో అటు 400కు పైగా వికెట్లు తీయడమే కాదు బ్యాటింగ్లో మూడు వేలకు పైగా పరుగులు చేసిన ఆరవ ఆటగాడిగా అశ్విన్ అరుదైన రికార్డును సృష్టించాడు. ఇక ఈ జాబితాలో కపిల్ దేవ్ తర్వాత చోటు సంపాదించుకున్న రెండవ భారతీయుడుగా అశ్విన్ నిలిచాడు అని చెప్పాలి. ఈ లిస్టు చూసుకుంటే రీఛార్జ్ హాడ్లీ 431 వికెట్లు 3124 పరుగులతో మొదటి స్థానంలో ఉండగా.. కపిల్ దేవ్ 434 వికెట్లు 5248 రన్స్ తో ఉన్నారు. ఇక ఆ తర్వాత షేన్ వార్న్, స్టువర్టు బ్రాడ్ షాన్ పొలాక్ ఉండగా ఇక అశ్విన్ ఆరవ స్థానంలో చోటు సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: