
భారత క్రికెటర్ల తరఫున అటు 8.25 కోట్లతో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మయాంక్ అగర్వాల్ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. అదే సమయంలో ఇక మినీ వేలంలో ఏదో ఒక ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుందని గట్టి నమ్మకంతో ఉన్న కొంతమంది సీనియర్ ప్లేయర్లకు మినీ వేలంలో ఊహించని షాక్ తగిలింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనె సీనియర్ బౌలర్గా కొనసాగుతున్న సందీప్ శర్మను సైతం ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు అని చెప్పాలి. గత ఏడాది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున కొనసాగాడు సందీప్ శర్మ. ఈసారి కూడా ఆ జట్టు మళ్లీ వేలంలో అతనికొనుగోలు చేస్తుందని అందరూ అనుకున్నారు.
సన్రైజర్స్ కాదు కదా ఏ ఫ్రాంచైజీ కూడా అతన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన సందీప్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ వేలంలో తనను ఎవరు కొనుగోలు చేయకపోవడంతో నిరాశకు గురయ్యాను అంటూ సందీప్ శర్మ చెప్పుకొచ్చాడు. నేనెందుకు అమ్ముడు పోలేదో తెలియట్లేదు. నేను ఇప్పటివరకు ఏ టీమ్ కు ఆడిన మంచి పర్ఫామెన్స్ ఇచ్చాను. కచ్చితంగా ఏదో ఒక ఫ్రాంచైజీ నాకోసం బీడ్ వేస్తుందని అనుకున్న.. కానీ ఇలా అవుతుందని ఊహించలేదు. ఎక్కడ తప్పు జరిగిందో అర్థం కావట్లేదు. ఐపీఎల్ సీజన్ తో పాటు దేశవాళీ టోర్నిలలో రాణించిన కూడా తీసుకోలేదు అంటూ నిరాశ వ్యక్తం చేశాడు సందీప్ శర్మ.