
ఇక ఇటీవలే ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా పోర్చుగల్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన రోనాల్డో తన జట్టుకి వరల్డ్ కప్ అందించడానికి తీవ్రంగా శ్రమించాడు అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇక పోర్చుగల్ జట్టు సెమి ఫైనల్లో ఓడిపోవడంతో ఇక వరల్డ్ కప్ గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇకపోతే ఇటీవలే క్రిస్టియానో రోనాల్డో సౌదీ ప్రో లీగ్ లో ఆడుతున్నాడు. ఇక అల్ నజర్ జట్టులో భారీ ధరకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు అన్న వార్త కాస్త గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
అయితే ఇక ఇప్పుడు సౌదీప్రో లీగ్ లో భాగంగా అల్ నజర్ జట్టు తరఫున ఆడేందుకు సిద్ధమైన క్రిస్టియానో రోనాల్డో కి చివరికి ఎదురు దెబ్బ తగిలింది అన్నది తెలుస్తుంది. అల్ నగర్ జట్టులోకి రావడంతోనే చిక్కుల్లో పడ్డాడు రోనాల్డో. ప్రస్తుతం సదరు జట్టు అతనితో కాంట్రాక్టు కుదుర్చుకున్నప్పటికీ.. ఇక ఇప్పుడు ఆడే అవకాశం మాత్రం కష్టమే అన్నది తెలుస్తుంది. ఎందుకంటే సౌదీ ప్రో లీగ్ టోర్నీ రూల్స్ ప్రకారం 8 మంది విదేశీ ఆటగాళ్లు మాత్రమే జట్టులో చోటు దక్కించుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే ఆల్ నజర్ జట్టులో 8 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు వారిలో ఎవరిని తప్పించడానికి వీల్లేదు అని చెప్పాలి. దీంతో ఇక కొత్తగా వచ్చిన విదేశీ ఆటగాడు రొనాల్డో కు చోటు దక్కడం కష్టమే అనేది తెలుస్తుంది.