ఐసీసీ ట్రోఫీ అయిన వన్ డే వరల్డ్ కప్ 2023 కు ఇంకా కొద్ది నెలల సమయం మాత్రమే ఉంది. దీనితో అన్ని జట్లు కూడా బెస్ట్ ప్లేయర్స్ ను కీలక టోర్నీకి ఎంపిక చేయడానికి కసరత్తులు చేస్తున్నారు. కాగా ఇండియా కూడా బెస్ట్ టీం ను వరల్డ్ కప్ కు పంపడానికి రొటేషన్ పద్దతిలో ఆడిస్తూ ట్రై చేస్తోంది. అందులో భాగంగా వరుస సిరీస్ లను ఆడుతూ ఉంది, బంగ్లాదేశ్ తో వన్ డే సిరీస్ ను కోల్పోయిన ఇండియా... ఆ తర్వాత శ్రీలంక పై నెగ్గింది. ప్రస్తుతం న్యూజిలాండ్ తో సొంతగడ్డపై మూడు వన్ డే లు ఆడనుంది. మొదటి వన్ డే లో ఇండియా కివీస్ పై 12 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దాదాపుగా వరల్డ్ కప్ లో పాల్గొనే జట్టు ఫైనల్ అయినట్లే.

నిన్నటి ఇన్నింగ్స్ తో శుబ్మాన్ గిల్ రోహిత్ కు జోడీగా ఓపెనర్ స్థానాన్ని పదిలం చేసుకున్నట్లే. వన్ డౌన్ లో కోహ్లీ, సెకండ్ డౌన్ శ్రేయాస్ అయ్యర్, మిడిల్ ఆర్డర్, సూర్య లతో బలంగా ఉంది. ఇక ఆల్ రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్య మరియు అక్షర్ పటేల్ స్థానాన్ని ఖాయం చేసుకున్నట్లే. ఇక మ్యాచ్ లో కీలకంగా భావించే స్పిన్నర్ ల విషయంలో పోటీ మాములుగా లేదు. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ గా అక్షర్ పటేల్ ఉండగా , లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్ మరియు రైట్ హ్యాండ్ స్పిన్నర్ గా వాషింగ్టన్ సుందర్ కూడా జట్టులో ఉండే అవకాశం ఉంది.

ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో యజ్వేంద్ర చాహల్ మరియు కుల్దీప్ యాదవ్ ల మధ్యన పోటీ నెలకొంది. అయితే ఈ మధ్యన జరిగిన మ్యాచ్ లను చూసుకుంటే చాహల్ ప్రదర్శన మరీ తీసికట్టుగా తయారయింది. వికెట్లు పడగొట్టడం సంగతి అటుంచితే కనీసం పరుగులను నియంత్రించడంలో కూడా దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. ఇక మరో వైపు కుల్దీప్ యాదవ్ కెరీర్ లో చాలా అప్ అండ్ డౌన్ లు ఉన్నాయి. దాదాపు కెరీర్ అంతం అయ్యే పరిస్థితి నుండి ఐపీఎల్ నుండి నెమ్మదిగా రాణిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు రెండు సిరీస్ ల నుండి కుల్దీప్ యాదవ్ విశేషంగా రాణిస్తూ సెలెక్టర్ లను ఆకట్టుకుంటున్నాడు. దీనితో చాహల్ కు వరల్డ్ కప్ ఆశలు ముగిసినట్లే అని క్రికెట్ ప్రముఖులు భావిస్తున్నారు. మరి చూద్దాం చివరికి ఎవరు వరల్డ్ కప్ బెర్త్ ను దక్కించుకుంటారో ?


 

మరింత సమాచారం తెలుసుకోండి: