టీమిండియా క్రికెట్లో ఎవరికి సాధ్యంకాని రీతిలో తనకంటూ ప్రత్యేకమైన చరిత్రను లికించుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని. ఒక ఆటగాడిగా మాత్రమే కాకుండా ఒక కెప్టెన్ గా కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే వరల్డ్ బెస్ట్ కెప్టెన్ గా.. వరల్డ్ బెస్ట్ వికెట్ కీపర్ గా.. వరల్డ్ బెస్ట్ ఫినిషిర్ గా కూడా మహేంద్ర సింగ్ ధోని తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. అయితే వికెట్ల వెనకాల ఉంటూ ఇక మ్యాచ్ స్వరూపాన్ని మొత్తం తన వైపుకు తిప్పుకోవడంలో మహేంద్రుడు దిట్ట అని చెప్పాలి.


 ధోని వికెట్ల వెనకాల నుంచి బౌలర్కు ఏదైనా సలహా ఇచ్చాడు అంటే చాలు ఇక అటు బ్యాట్స్మెన్ గుండెల్లో గుబులు పుడుతూ ఉంటుంది.  ఎందుకంటే అతని సలహాతో బౌలర్ ఎలాంటి బంతిని వేసి వికెట్ పడగడతాడో అని భయపడిపోతూ ఉంటారు అని చెప్పాలి. అంతేకాదు ఇక అటు క్రికెట్లో ఉండే డిఆర్ఎస్ రివ్యూ సిస్టం కూడా అటు ధోని రివ్యూ సిస్టం అని ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు పిలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ధోని ఒక్కసారి రివ్యూ తీసుకున్నాడు అంటే చాలు క్రీజులో ఉన్న ఆటగాడు దాదాపు అవుట్ అయిపోయినట్లే. అందుకే అందరూ కూడా డిఆర్ఎస్ రివ్యూ ని ధోని రివ్యూ సిస్టం అని అంటూ ఉంటారు. ఇక ఇదే విషయంపై ధోని స్నేహితుడు సురేష్ రైనా మాట్లాడాడు.


 అభిమానులు డిఆర్ఎస్ ను ధోని రివ్యూ సిస్టం అని పిలుస్తారని విషయం ధోనీకి తెలుసు.. నాకు కూడా ప్రతిసారి అదే గుర్తొస్తుంది. కానీ ఆ తర్వాతే డిఆర్ఎస్ అంటే డెసిషన్ రివ్యూ సిస్టం అని తెలుసుకున్నాను. ఇక ధోని ఎప్పుడు రివ్యూ ని చివరి క్షణంలో మాత్రమే తీసుకుంటాడు సురేష్ రైనా చెప్పుకొచ్చాడు. ఎందుకంటే బౌలర్ అది కచ్చితంగా అవుట్ అని భావిస్తాడు.. కానీ వికెట్ల వెనకాల ఉండే ధోనీకి మాత్రం మూడు స్టంప్స్ చాలా స్పష్టంగా కనిపిస్థాయి. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయం  తీసుకుంటాడు అంటూ సురేష్ రైనా తెలిపాడు. ధోని ఒక్కసారి అప్ఫీల్ చేశాడంటే అది కచ్చితంగా అవుట్ అని నేను భావిస్తాను అంటూ ప్రజ్ఞాన్ ఓజా కూడా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: