టీమిండియాలో స్టార్ బాట్స్మన్ గా కొనసాగుతున్న రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదం బారిన పడి తీవ్ర గాయాల పాలయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ముంబైలోని కోకిల బెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు రిషబ్ పంత్. అయితే అతను వేగంగా కోలుకుంటున్నాడు అని చెబుతున్నారు వైద్యులు. కానీ ఇక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలు అయిన నేపథ్యంలో అతనికి కొన్ని సర్జరీలు అయ్యాయి అని చెప్పాలి.  ఈ నేపద్యంలో దాదాపు 6 నుంచి 8 నెలల పాటు అతడు క్రికెట్కు పూర్తిగా దూరంగా ఉండే ఛాన్స్ ఉందని బీసీసీఐ వర్గాల నుంచి సమాచారం.


 ఈ క్రమంలోనే ఇక ఈ ఏడాది టీమిండియా ఆడబోయే కీలకమైన సిరీస్ లకు అటు రిషబ్ పంత్ దూరం కావడమే కాదు అటు ఐపీఎల్ పూర్తి సీజన్కు కూడా అతను అందుబాటులో ఉండడం కష్టమే అని  ఇప్పటికే క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ప్రస్తుతం ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు రిషబ్ పంత్.  ఇక అతను అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో డేవిడ్ వార్నర్ కు కెప్టెన్సీ అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్ రిషబ్ పంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 బుమ్రా భార్య ప్రజంటేటర్ సంజన గణేషన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పంత్ లాంటి వ్యక్తులను భర్తీ చేయడం కష్టం. ఇక అతని స్థానంలో వచ్చే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కోసం మేం వెతకాలి. అతను ఆడటానికి ఫిట్ గా లేకపోయినా పంత్ మాతో ఉండాలని కోరుకుంటున్నాం. పంత్ ఒక కెప్టెన్ గానే కాదు.. అందరికీ వ్యాపించే అతని నవ్వు కూడా మాకు బాగా నచ్చుతుంది. ఒకవేళ అతను ప్రమాణాలకు సిద్ధంగా ఉంటే టీం తో ఉండాలనుకుంటే డగౌట్ లో వచ్చి నాతో పాటు కూర్చుంటే చాలు అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. మార్చి నెలలో మేం క్యాంప్ ఏర్పాటు చేయబోతున్నాము. అప్పట్లోగా అతను రాగలిగితే వచ్చి టీమ్ కి తోడ్పాటుగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నా అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: