
క్రీజులో పాతుకుపోయి ప్రత్యర్థి బౌలర్లకు విసుగు తెప్పించే విధంగానే.. అటు చేటేశ్వర పూజార బ్యాటింగ్ ఉంటుంది అని చెప్పాలి. కేవలం ఒకే ఒక పరుగు చేయడానికి కొన్ని కొన్ని సార్లు చటేశ్వర్ పూజార 50 బంతులను తీసుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఆ తర్వాత కాలంలో మాత్రం ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడి జట్టులో స్థానం కోల్పోయాడు. కానీ కౌంటి క్రికెట్లో అద్భుతంగా రానించి ఇక సెలక్టర్లు చూపును ఆకర్షించి.. అటు భారత జట్టులోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే.
ఇక బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత తరఫున మళ్లీ పునరాగమనం చేసిన చటేశ్వర పూజార తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో 90 పరుగులు ఇక ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో 102 పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఇక టెస్టులకు గ్యాప్ రావడంతో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కి ముందు రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర తరపున ఆడుతున్నాడు అని చెప్పాలి. ఇక రంజీ ట్రోఫీలో కూడా అదే రీతిలో తన బ్యాటింగ్‌తో అదరగొడుతూ ఉన్నాడు. ఇకపోతే ఆస్ట్రేలియా తో టెస్ట్ సిరీస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా తో సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న.. అయితే ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో ఆడటం చాలా కష్టం. అతను తన వేరియేశన్స్ తో బ్యాట్స్‌మెన్ లను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కానీ ఈసారి అతనిపై పై చేయి సాధించాలని అనుకుంటున్నా అంటూ కామెంట్ చేశాడు.