ఈనెల తొమ్మిదవ తేదీ నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో టెస్ట్ సిరీస్ ఆడబోతుంది . ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్ కు సంబంధించి ప్రస్తుతం ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు. సాధారణంగానే భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ అంటే చాలు ఇక అందరి దృష్టి కూడా ఈ సిరీస్ పైనే ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇరు జట్లు కూడా పటిష్టమైన జట్లే కావడంతో ఇక హోరాహోరీ పోరు చూసేందుకు అవకాశం ఉంటుంది.

 అయితే ఇక ఈ నెల 9వ తేదీ నుంచి మొదటి టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇదే విషయంపై ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాజీ ప్లేయర్లు కూడా స్పందిస్తూ రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవలే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ హీలి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిపోయాయి. టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ తమకు అనుకూలంగా  పీచ్ లను కాకుండా సాధారణ పిచ్ లను సిద్ధం చేస్తే తప్పకుండా ఆస్ట్రేలియా అనే విజయం సాధిస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే ఇక ఈ వ్యాఖ్యలపై అశ్విన్ తనదైన శైలిలో స్పందించాడు.


 భారత్ తో సిరీస్ ఉందంటే చాలు ఆస్ట్రేలియా మైండ్ గేమ్ కి పాల్పడటం చూస్తూనే ఉంటాం. ఇక ఆ జట్టు స్లెడ్జింగ్ కి ప్రసిద్ధి అని అందరికీ తెలుసు కదా. ఇదే వారి క్రికెట్ స్టైల్.. ఏదో ఒక విధంగా అగ్గి రాజేస్తుంది అన్నట్లుగా రవిచంద్రన్ అశ్విన్ కామెంట్ చేశాడు. సిరీస్ కి ముందు ఇలాంటి వ్యాఖ్యల వల్ల వారికి మంచి ఊపు వస్తుందని అశ్విన్ చెప్పుకొచ్చాడు.  ఇలా సిరీస్ ప్రారంభానికి ముందు ఆయన అగ్గి రాజేనట్లే ఉన్నారు.  భారత్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అసౌకర్యానికి గురవుతారని ఇంతకు ముందు వ్యాఖ్యానించారు.  ఇలాంటి మైండ్ గేమ్  వారికి కావాల్సింది అంటూ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: