గతంలో ఇంగ్లాండ్ క్రికెటర్ అజీమ్ రఫీక్ జాతి వివక్షకు గురయ్యాడు అన్న విషయం ప్రపంచ క్రికెట్లో ఎంత సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాను వేధింపులకు గురయ్యాను అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు అజీమ్ రఫీక్  ఇక ఇదే విషయంపై ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ జాతి వివక్షపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇక ఇటీవలే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ సైతం ఇదే విషయంపై స్పందించాడు. డ్రెస్సింగ్ రూమ్ లో జాతి వివక్షకు సంబంధించిన వేధింపులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందంటూ అభిప్రాయపడ్డాడు.


 ఇటీవల మెరీల్ బోన్ క్రికెట్ క్లబ్ తరఫున ఉపన్యాసం చేశాడు ఆండ్రూ స్ట్రాస్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆటగాళ్లను వ్యక్తిగతంగా పరిహాసం చేయొద్దు అంటూ సూచించాడు  ఎందుకంటే వేరువేరు ప్రాంతాల నుంచి విభిన్నమైన ఆటగాళ్లు క్రికెట్ ఆడేందుకు వస్తూ ఉంటారు. అందుకే విభిన్న ప్రాంతాల నుంచి వచ్చిన వారు కలిసి ఆడటం.. డ్రెస్సింగ్ రూమ్ను పంచుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో పరిహాసానికి కఠిన పదాలు వాడటం ఏమాత్రం మంచిది కాదు. సాంప్రదాయాలకు విరుద్ధంగా మాట్లాడటం లాంటి వాటికి స్థానం కల్పించ వద్దు. సహనంతో అర్థం చేసుకొని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి అంటూ సూచించాడు. ఇక ఇప్పుడున్న పురుష క్రికెటర్లకు ఇలాంటి క్రీడా స్ఫూర్తి చాలా అవసరం అంటూ తెలిపాడు.


 ఒక్కసారి అంతర్జాతీయ జట్టులోకి వచ్చిన తర్వాత నిరంతరం మీడియా నిఘా ప్రతి ఒక్క ఆటగాడి పై ఉంటుంది అంటూ తెలిపాడు ఆండ్రూ స్ట్రాస్.  మేకల్లమ్, బెన్ స్టోక్స్  కలిసి ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తారు అంటూ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరూ కలిసి 10 టెస్ట్ మ్యాచ్ లలో తొమ్మిదింటిలో కూడా ఇంగ్లాండ్ ను గెలిపించారు అంటూ గుర్తు చేశాడు. గతంలో ఉండే టెస్ట్ ఫార్మాట్ కు ఎంతో భిన్నమైన పద్ధతిని అవలంబించి ఇక దూకుడైన ఆట తీరును ప్రదర్శించారు అంటూ ఆండ్రూ స్ట్రాస్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: