2023 ఏడాదిలో జనవరి నెల మొత్తం పరిమిత ఓవర్ల ఫార్మాట్లో వరుసగా మ్యాచ్లు ఆడిన టీమిండియా జట్టు.. ఇక ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఇక్కడ టెస్ట్ సిరీస్ లో హోరాహోరీగా తరబడేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగబోతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ లో మునిగి తేలుతూ ఉంది. భారత్  ఆస్ట్రేలియా మధ్య 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే..


 అయితే గత రెండు మూడు ఏళ్ల నుంచి కూడా బోర్డర్ గోవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు ఎంతలా సత్తా చాటుతూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ఆస్ట్రేలియా జట్టును వారి సొంత గడ్డపైనే ఓడించి చరిత్ర సృష్టించింది టీమిండియా. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు ఏకంగా సొంత గడ్డపై సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో భారత జట్టుకు తిరుగు ఉండదు అని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా తో జరిగే నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ గెలిస్తే భారత జట్టు ప్రపంచ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది.


 ఎందుకంటే తొలిసారి 1996 - 97 లో జరిగిన బోర్డర్ కవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది భారత జట్టు. ఇక ఆ తర్వాత 2016-17, 2018-19, 2020- 2021 సీజన్లో కూడా టీమ్ ఇండియానే సిరీస్ లను కైవసం చేసుకుని ఆదిపత్యాన్ని కొనసాగించింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇప్పుడు 2022- 23 సీజన్ కి గాను ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఆస్ట్రేలియా భారత్ మధ్య బోర్డర్ గావాస్కర్ ట్రోఫీ జరగబోతుంది  ఒకవేళ టీమ్ ఇండియా ఈ సిరీస్లో విజయం సాధిస్తే ఇక నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ను వరుసగా నాలుగవ సారి సొంతం చేసుకున్న ఏకైక జట్టుగా ప్రపంచ క్రికెట్లో అరుదైన రికార్డ్ సృష్టించబోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: