
ఈ క్రమంలోనే ఇక నాలుగో మ్యాచ్ చివరికి డ్రాగ ముగిసింది.దీంతో 2-1 తేడాతో అటు భారత జట్టు సిరీస్ కైవసం చేసుకుంది అని చెప్పాలి. అయితే మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఆస్ట్రేలియా భారత ఆటగాళ్లు ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ మ్యాచ్ ముగిసిన తర్వాత మాత్రం ఇక మైదానంలో స్నేహితుల్లా కలిసిపోయి ఒకరితో ఒకరు ముచ్చటించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత ఆటగాళ్లందరూ కూడా మరోసారి క్రీడా స్ఫూర్తిని కనబరిచారు. ఏకంగా ప్రత్యర్థి ఆస్ట్రేలియా ఆటగాళ్లతో మాట్లాడుతూ ఇక వారికి విలువైన సలహాలను ఇచ్చారు అని చెప్పాలి
ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా జట్టు తరఫున ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతోనే డెబ్యు మ్యాచ్ ఆడాడు ఆస్ట్రేలియా బౌలర్ కుహునే మన్. అయితే మొదటి సిరీస్ అయినప్పటికీ ఎలాంటి ఒత్తిడి అతనిలో కనిపించలేదు. తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేసి వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి. అయితే నాలుగో మ్యాచ్ పూర్తయిన అనంతరం టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తనతో మాట్లాడుతూ పలు సూచనలు చేసినట్లు తెలిపాడు కుహునే మన్. దాదాపు పావు గంటసేపు ఇక రవీంద్ర జడేజా తో మాట్లాడినట్లు కుహునేమన్ తెలిపాడు. ఫ్యూచర్లో భారత్తో జరగబోయే మ్యాచ్ల కోసం చిట్కాలు ఇచ్చాడని.. సిరీస్లో రవీంద్ర జడేజా ప్రదర్శన ఆకట్టుకుందని.. తనకు సూచనలు ఇవ్వడం గొప్ప విషయం అంటూ చెప్పుకొచ్చాడు.