ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ కూడా అటు ప్రేక్షకులందరికీ కూడా అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఒక్కో మ్యాచ్ అయితే పైసా వసూల్ మ్యాచ్ అన్నట్లుగానే సాగుతూ వస్తుంది. ఇక ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జాయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఇదే రీతిలో ఉత్కంఠ భరితంగా సాగింది అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో భాగంగా తొలత బ్యాటింగ్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అయితే మొదటి మ్యాచ్ లో విఫలమైనట్లుగా ఈసారి మాత్రం ఎవరు విఫలం కాలేదు. అందరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. ఏకంగా 20 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 217 పరుగుల భారీ స్కోరు చేసింది అని చెప్పాలి.


 అంతకుముందు గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన ఋతురాజ్ గైక్వాడ్   ఇక ఇటీవల లక్నోతో జరిగిన మ్యాచ్లో కూడా మరోసారి చెలరేగిపోయాడు అని చెప్పాలి. 26 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు మూడు ఫోర్ల సహాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక 57 పరుగుల వద్ద బిష్ణయ్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అని చెప్పాలి. అయితే గత కొన్ని సీజన్స్ నుంచి ఋతురాజు గైక్వాడ్ అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే గతంలోనే అతనికి టీమిండియాలో చోటు దక్కుతుందని అందరూ అనుకున్నారు.


 అయితే టీమిండియాలోకి వచ్చినా కేవలం అడపాదడప అవకాశాలను మాత్రమే దక్కించుకున్నాడు. కానీ ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రం తన కెరీర్ లోనే అత్యుత్తమమైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు అన్నది మాత్రం తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇక ఈ ఏడాది ప్రదర్శన ఆధారంగా ఎట్టి పరిస్థితుల్లో భారత జట్టులో చోటు సంపాదించుకోవడమే లక్ష్యంగా అతను ముందుకు సాగుతున్నాడు అన్నది మాత్రం అర్థం అవుతుంది. దీంతో ప్రతి మ్యాచ్ లో కూడా ఎంతో కసిగా బ్యాటింగ్ చేస్తూ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు అని చెప్పాలి. లక్నోతో జరిగిన మ్యాచ్లో కూడా మంచి ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర వహించాడు. అతను ఐపీఎల్లో ఇలాగే రాణిస్తే ఇక ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియాలో కనిపించడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl