ఇటీవల కాలంలో ఐపీఎల్ లో టాలెంట్ నిరూపించుకుని ఫ్యూచర్ స్టార్స్ అని నమ్మకం కలిగిస్తున్న ఆటగాళ్లు కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో ఋతురాజ్ గైక్వాడ్ కూడా ఒకరు అని చెప్పాలి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఐపీఎల్ లోకి అరంగేట్రం చేశాడు. అయితే మొదటి మ్యాచ్ లో మొదటి బంతికే దకౌట్ అయ్యి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక అతను రానించడం కష్టమే అని అందరూ భావించారూ. కానీ ఆ తర్వాత మ్యాచ్లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 2021 సీజన్ లో 635 పరుగులు చేసి అతి పిన్న వయసులోనే ఆరెంజ్ క్యాప్ గెలిచిన ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు ఋతురాజ్ గైక్వాడ్.



 2022 సీజన్లో 368 పరుగులు చేశాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ సీజన్లో మొదటి మ్యాచ్లో 92 పరుగులు, రెండో మ్యాచ్లో 57 పరుగులు చేసి మళ్ళీ తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవల యువ ఆటగాడు ఋతురాజ్ గైక్వాడ్  అటు క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఊహించని ట్వెస్ట్ ఇచ్చాడు అని చెప్పాలి. సాధారణంగా ఏ యువ ఆటగాడిని నీ రోల్ మోడల్ ఎవరు అని అడిగితే ధోని లేదా కోహ్లీ, రోహిత్ పేరు చెబుతారు. కానీ రుతురాజుకి ఇలాంటి ప్రశ్న ఎదురైనప్పుడు అతను ఎవరు ఊహించుని సమాధానం చెప్పాడు. ధోని, కోహ్లీ సచిన్ కాదు సురేష్ రైనా నా ఇన్స్పిరేషన్ అంటూ ఋతురాజ్ చెప్పుకొచ్చాడు.


 తన ఫేవరెట్ క్రికెటర్ సురేష్ రైనా అని..  అతనే నా రోల్ మోడల్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అతడిలాగే చెన్నై జట్టుకు ఆడాలని ఉంది అంటూ మనసులో మాట బయటపెట్టాడు. దీంతో ఇక ఋతురాజు చెప్పిన సమాధానంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. క్రికెట్లోకి వచ్చే చాలామంది ప్లేయర్స్ సచిన్, విరాట్ ధోని పేరు చెబితే రుతురాజ్ గైక్వాడ్ మాత్రం మొదటిసారి రైనా పేరును తెరమీద తీసుకురావడంతో ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సురేష్ రైనా మిస్టర్ ఐపిఎల్ గా పేరు సంపాదించుకున్నాడు. చెన్నై జట్టు తరఫున ఎన్నో అద్వితీయమైన ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: