అయితే కోహ్లీ కెప్టెన్సీ రిటైర్మెంట్ తర్వాత బెంగళూరు జట్టు బాధ్యతలు అటు ఎబి డివిలియర్స్ చేతికి వెళ్తాయి అనుకున్నప్పటికీ 2021 ఐపిఎల్ ప్రారంభానికి ముందే దివిలియర్స్ ఏకంగా ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఇకపోతే ఇటీవల కోహ్లీ కెప్టెన్సీ వదిలేయడం గురించి అతని స్నేహితుడు ఏబీడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ తో పాటు భారత జట్టు సారధ్య బాధ్యతలు వదిలేయడంతోనే కోహ్లీ సంతోషంగా ప్రశాంతంగా ఉన్నాడు అంటూ అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీలో పెద్దగా మార్పు ఏమీ లేదు. అతని ఆటతీరులో టెక్నిక్ అలాగే బలంగా ఉంది. ఇక క్రీజ్ లో ఎంతో చక్కగా కదులుతున్నాడు. అయితే ఈ సీజన్ కోసం ఎంతో ఫ్రెష్ గా కోహ్లీ సిద్ధమయ్యాడు. ఇక ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో విరాట్ కోహ్లీని చూస్తే మునుపటికంటే ఎక్కువగా నవ్వుతూ కనిపించాడు. అయితే అతని నవ్వుల వెనుక కెప్టెన్సీ వదిలేయడమే కారణం అనుకుంటున్నాను. అతను ఒక అద్భుతమైన నాయకుడు. కానీ సుదీర్ఘకాలం పాటు అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కు ఐపీఎల్ లో ఆర్సిబి కి సారధిగా వ్యవహరించడం కష్టమైన పని. కుటుంబం, స్నేహితులతో గడిపేందుకు సమయం దొరకదు. ఇక ఇప్పుడు ఆ భారం లేదు కాబట్టి కోహ్లీని నవ్వులు చిందిస్తున్నాడు. అంటూ ఎబి డివిలియర్స్ వ్యాఖ్యానించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి