ఐపీఎల్ హిస్టరీ లో ఉన్న పటిష్టమైన జట్ల గురించి చర్చ వచ్చినప్పుడల్లా అటు ఢిల్లీ క్యాపిటల్స్ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అలాంటి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఐపీఎల్ హిస్టరీలో ఎన్నడూ లేనంతగా ఘోర పరాభవాలు ఎదురవుతున్నాయి అని చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఢిల్లీ క్యాపిటల్స్ కి ఒక పీడకలలా మిగిలి పోతుంది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు.



 ఎందుకంటే మిగతా జట్లు వరుస విజయాలు సాధిస్తూ దూసుకు పోతూ ఉంటే.. అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మాత్రం ఇప్పటివరకు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో బోణి కొట్ట లేదు అని చెప్పాలి. ఐదు మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇక ఐదింటి లో కూడా ఓడి పోయింది. కొన్ని కొన్ని సార్లు గెలిచే మ్యాచ్ లలో కూడా ఓడిపోయి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. అయితే ఇలా ఢిల్లీ జట్టు వరుసగా ఓడి పోతూ ఉండడాన్ని అటు అభిమానులు కూడా అసలు జీర్ణించుకోలేక పోతున్నారు  అని చెప్పాలి.



 రికీ పాంటింగ్ లాంటి ఉత్తమమైన కోచ్ ఉన్నప్పటికీ.. వార్నర్ లాంటి అనుభవజ్ఞుడైన కెప్టెన్ ఉన్నప్పటికీ.. గంగూలి లాంటి ఎంతో తెలివిగల మెంటర్ ఉన్నప్పటికీ ఢిల్లీ జట్టుకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందో అర్థం కాక ఫ్యాన్స్ తల పట్టుకుంటున్నారు. ఇక ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించాడు. ఇతర జట్లు విజయాలతో దూసుకుపోతున్న వేళ ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఒక్క గెలుపు కోసం పోరాడుతుంది. వరుసగా ఐదు మ్యాచ్ లలో ఓడిన జట్టు తిరిగి పుంజుకోవడం కాస్త కష్టమే. ఢిల్లీ డకౌట్లో ఉండే గంగూలీ  రికీ పాంటింగ్, వార్నర్ లకు ఎవరికి కూడా ఓడిపోవడం నచ్చదు. కాని చివరి వరకు పోరాడి ఓడిపోతుంది అంటూ రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl